Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్టీజర్ నిండా బూతులే బూతులు

టీజర్ నిండా బూతులే బూతులు

Rayalaseema love story teaser reviewరాయలసీమ లవ్ స్టోరీ పేరిట ఇటీవలే మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది అలాగే తాజాగా టీజర్ కూడా విడుదల చేసారు . అయితే మోషన్ పోస్టర్ పరమ బూతులా అనిపించగా తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో ఇంకా బూతులు ఉన్నాయి . పచ్చిగా శృంగార సన్నివేశాలు అలాగే డైలాగ్స్ కూడా . యువత బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినట్లుగా ఉంది ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రం . యువ దర్శకులు రామ్ రణధీర్ దర్శకత్వంలో తెరకెక్కిన రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని పంచలింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు లు సంయుక్తంగా నిర్మించారు . వెంకట్ – హృశాలి గోసవి జంటగా నటించగా పావని మరో హీరోయిన్ గా నటించింది . అయితే వెంకట్ – హృశాలి గోసవి ల మధ్య చిత్రీకరించిన శృంగార సన్నివేశాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాయి .

- Advertisement -

పేరేమో రాయలసీమ లవ్ స్టోరీ కానీ అందులో ఉన్నది మాత్రం ఎక్కువగా బూతు దాంతో కొంతమంది నెటిజన్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం శృంగార సన్నివేశాలను అలాగే బూతుల డైలాగ్స్ వింటూ ఆనందం పొందుతున్నారు . అడల్ట్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు కొన్ని సంచలన విజయం సాధించడంతో ఆ కోవలో మరికొన్ని చిత్రాలు వస్తూనే ఉన్నాయి . ఇప్పుడేమో ఈ రాయలసీమ లవ్ స్టోరీ వస్తోంది . మొత్తానికి టీజర్ తో కేక పెట్టించారు .

English Title: Rayalaseema love story teaser review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts