Homeటాప్ స్టోరీస్డెబ్భై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న రాయలసీమ లవ్ స్టోరీ

డెబ్భై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న రాయలసీమ లవ్ స్టోరీ

Rayalaseema Love Storyవెంకట్ ని హీరోగా పరిచయం చేస్తూ రామ్ రణధీర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” రాయలసీమ లవ్ స్టోరీ ”. హృశాలి , పావని లు హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రం కర్నూల్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే . మొదటి షెడ్యూల్ ని అలాగే రెండో షెడ్యూల్ ని కూడా రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో కొనసాగుతోంది . హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు రామ్ రణధీర్ . ఈ సందర్బంగా దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ ” రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి అమృత హస్తాలతో మా చిత్రం ప్రారంభం కావడం చాలా సంతోషాన్నించింది అలాగే ప్రారంభమైనప్పటి నుండి దిగ్విజయంగా షూటింగ్ జరుగుతోంది . ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయ్యింది . ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది , ఇక నాలుగో షెడ్యూల్ మళ్ళీ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో జరుపుతాం దాంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది . నటీనటులు , సాంకేతిక నిపుణులు అందరూ సహకరించడం వల్ల అనుకున్న విధంగా షూటింగ్ పూర్తిచేయగలిగామని , అందుకు మా నిర్మాతలకు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు .

చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా , నాగరాజు మాట్లాడుతూ ” మా రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్ కి మంచి స్పందన వచ్చింది , అలాగే అంతకంటే మిన్నగా సినిమా కూడా చాలా బాగా వస్తోంది . రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నామని ……. రాయలసీమ కథ అనగానే రెగ్యులర్ గా వచ్చే చిత్రమని భావిస్తారని కానీ మా చిత్రం పూర్తిగా భిన్నమైనదని , త్వరలోనే ఫస్ట్ లుక్ ని అలాగే టీజర్ ని రిలీజ్ చేస్తామని అన్నారు .

- Advertisement -

సంగీత దర్శకుడు శ్రీ సాయి మాట్లాడుతూ : రాయలసీమ లవ్ స్టోరీ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు . ఈ చిత్రంలో అయిదు పాటలు ఉన్నాయి , అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఆల్బమ్ సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది , అలాగే నాకు మంచి పేరు తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు . వెంకట్ , పావని , హృశాలి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నాగినీడు , జీవా , మధుమణి , మాధవి మిర్చి , అదుర్స్ రఘు , తాగుబోతు రమేష్ , గెటప్ శ్రీను , జబర్దస్త్ కొమరం , నల్లవేణు తదితరులు నటిస్తుండగా
ఏ 1ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All