Homeటాప్ స్టోరీస్మాస్ మహారాజా మారనంటున్నాడు!

మాస్ మహారాజా మారనంటున్నాడు!

మాస్ మహారాజా మారనంటున్నాడు!
మాస్ మహారాజా మారనంటున్నాడు!

మాస్ మహారాజా రవితేజ వరస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెల్సిందే. రవితేజ నటించిన నాలుగు చిత్రాలు దారుణమైన ఫలితాల్ని అందుకున్నాయి. ఈ సినిమాలు ప్లాప్ అవ్వడమే కాకుండా రవితేజ కెరీర్ లోనే బ్యాడ్ ఫిలిమ్స్ గా నిలిచాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా సైతం రవితేజ ఆశలపై నీళ్లు చల్లింది. ఒకానొక సమయంలో ఒక్క రోజులోనే 6 కోట్ల షేర్ ను రాబట్టగలిగిన స్టామినా ఉన్న రవితేజ డిస్కో రాజా ఫుల్ రన్ లో కేవలం 6 కోట్లు వసూలు చేయడంతో తన కెరీర్ ఎంతలా పతనమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రవితేజకు ఒక భారీ హిట్ చాలా అవసరం. తను ప్రస్తుతం నటిస్తోన్న క్రాక్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

రవితేజకు వరస ప్లాప్స్ వస్తున్నా కానీ అవకాశాలకు మాత్రం కొదవ లేదు. క్రాక్ కాకుండా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా కరోనా వైరస్ కారణంగా వాటికి బ్రేక్ పడింది. రమేష్ వర్మ చిత్రం కాకుండా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు మాస్ మహారాజా.

- Advertisement -

అయితే ఈ కథకు సంబంధించి కొంత లీకులు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. 80ల కాలం నాటి డాన్ గా రవితేజ ఈ చిత్రంలో నటించనున్నాడట. ఇటీవలే డిస్కో రాజాలో రవితేజ అలాంటి పాత్రనే వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఒక్కసారి ప్లాప్ వచ్చినా కానీ మరోసారి అలాంటి కథాంశాన్నే ఎంచుకోవడంలో ఆంతర్యమేంటో రవితేజకే తెలియాలి.

అయితే డిస్కో రాజాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్నది మేజర్ కంప్లైంట్. కాకపొతే త్రినాధరావు సినిమాలో అవన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా రవితేజ త్వరగా ఈ ప్లాపుల నుండి కోలుకుని మళ్ళీ మునుపటి ఎనర్జీతో వరస హిట్స్ అందివ్వాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All