
మాస్ మమారాజా రవితేజ ప్రస్తుతం `క్రాక్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహీసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రలో తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఈ మూవీ షూటింగ్‌ని నిరవధికంగా నిలిపివేశారు.
తాజాగా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా మళ్లీ షూటింగ్‌లన్నీ పునః ప్రారంభం కావడంతో ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత మాస్ మహారాజా ఎవరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం మేరకు రవితేజ `క్రాక్` షూటింగ్ ఫినిష్ చేసిన వెంటనే త్రినాథరావు నక్కిన చిత్రాన్ని పట్టాలెక్కింస్తారట.
రవితేజ `రాక్షసుడు` ఫేమ్ రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేనున్న విషయం తెలిసిందే. దీన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభం కావడానికి టైమ్ వుండటంతో ఆ సమయాన్ని త్రినాథరావు నక్కిన చిత్రానికి కేటాయిస్తున్నారట రవితే. దీని తరువాతే రమేష్‌వర్మ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారట.