Homeటాప్ స్టోరీస్మాస్ మహారాజా ఈసారి డబల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాడుగా

మాస్ మహారాజా ఈసారి డబల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాడుగా

మాస్ మహారాజా ఈసారి డబల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాడుగా
మాస్ మహారాజా ఈసారి డబల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాడుగా

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కెరీర్ పరంగా డౌన్ లో ఉన్నాడు. రవితేజ నుండి హిట్ వచ్చి చాలా కాలమైంది. అందుకే కెరీర్ పరంగా కొంత బ్రేక్ తీసుకున్న రవితేజ ఈసారి డబల్ డోస్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే వచ్చే ఏడాది మాత్రం రెండు లేదా మూడు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. రెండు అయితే పక్కా రిలీజ్ ఉంటుంది.

ముందుగా రవితేజ నటించిన డిస్కోరాజా సినిమా జనవరి 24న రిలీజ్ అవుతుంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఇప్పుడు జనవరిలో రిలీజ్ ను ప్లాన్ చేశారన్నమాట. ఈ సినిమాలో రవితేజ భిన్నంగా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. మాస్ మహారాజాలో మునుపటి ఎనర్జీ కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా రవితేజ నుండి కోరుకునేది ఇదే కాబట్టి ఈ సినిమాకు విజయావకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. పైగా దర్శకుడు విఐ ఆనంద్ కూడా భిన్నమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఒక పాట విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెల్సిందే.

- Advertisement -

డిస్కో రాజా విడుదలవ్వగానే రవితేజ తన తర్వాతి సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. మరోసారి రవితేజ పోలీస్ అవతారంలోకి మారబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాను చేయబోతున్నాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా ఎంపికవ్వగా, థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి కుదిరితే సమ్మర్ కు, లేదంటే దసరాకు విడుదల చేయాలన్నది ప్లాన్ గా పెట్టుకున్నారు.

ఒకవేళ సమ్మర్ కు క్రాక్ కనుక వస్తే 2020లోనే మరో సినిమాను కూడా మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. ఈ రకంగా 2020 లోనే రవితేజ తన ఫ్యాన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. మరి సినిమాల సంగతి ఓకే కానీ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All