Homeగాసిప్స్రవితేజ క్రాక్ సినిమా కథ ఆ పోలీసాఫీర్ రియల్ లైఫ్ స్టోరీ నా.?

రవితేజ క్రాక్ సినిమా కథ ఆ పోలీసాఫీర్ రియల్ లైఫ్ స్టోరీ నా.?

Ravi Teja Krack movie is real story?
Ravi Teja Krack movie is real story?

రవితేజ ఆ పోలీస్ ఆఫీసర్ జీవిత కథ ఆధారంగా వచ్చే సినిమాలో నటిస్తున్నాడా.?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం ప్రారంభమైన రవితేజ సినిమా క్రాక్ ఇటీవలే పోలీసు ఆఫీసర్ గా పనిచేసి, ఇప్పుడు ఎంపీగా గెలిచిన వ్యక్తి నిజ జీవిత కథని పోలి ఉంటుందా.?

- Advertisement -

రవితేజ కి అతని కెరీర్ లో హిట్లు తీసుకొచ్చిన సినిమాలలో ఎక్కువ పోలీస్ కథలు ఉన్నాయి. ఉదాహరణకు విక్రమార్కుడు సినిమాతో మొదలుపెట్టి దుబాయ్ శీను, పవర్ ఇలా అనేక సినిమాలలో పోలీస్ గా కనిపించి అటు క్లాస్ ఇటు మాస్ ని ఫుల్ గా అలరించాడు మాస్ రాజా. రవితేజతో డాన్ శీను, బలుపు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం రవితేజతో క్ర్రాక్ అనే సినిమాను ప్రారంభించాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్

ఈ సినిమాకు సంబంధించి మొదట ఇది ఒక రీమేక్ కథ అని చెప్పి ప్రచారం జరిగినా, తర్వాత వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పోలీస్ ఆఫీసర్ కథ అని చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త షికారు చేస్తోంది. అదేమిటంటే ఈ క్రాక్ అనే సినిమా కథ గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎస్పీగా పని చేసి ఇటీవల ఎంపీగా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నిజ జీవిత కథ అని చెప్పి ప్రచారం జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఏర్పడిన నేపథ్యంలో అనంతపురం పరిధిలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యర్థి గా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో, గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఎంపీగా పోటీ చేసి గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.

అదేవిధంగా అనంతపురంలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న జెసి దివాకర్ రెడ్డి గారు కొన్ని సందర్భాలలో పోలీసులపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ, కొంత అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన నేపథ్యంలో ఆయనకు ధీటుగా సమాధానం చెప్పి, తేడా వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా చూడమని సమాధానం చెప్పి వార్తల్లో నిలిచిన వ్యక్తి గోరంట్ల మాధవ్. ఆయనలోని ఈ డేరింగ్ & డాషింగ్ పర్సనాలిటీ నచ్చే, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏరికోరి తీసుకువచ్చి అనంతపురంలో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎంత వరకు నిజమో తెలియదు గానీ, గోరంట్ల మాధవ్ నిజ జీవిత కథ ఆధారంగానే రవితేజ నటించిన సినిమా ఉంటుంది అని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి

ఒకవేళ ఇది అలాంటి కథ అయినా, కాకపోయినా, మరోసారి పోలీస్ యూనిఫాం వేసుకున్న మన మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాతో సూపర్ హిట్ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All