Homeటాప్ స్టోరీస్`అన్నియ‌న్‌` రీమేక్‌కు ర‌విచంద్ర‌న్ బ్రేక్‌!

`అన్నియ‌న్‌` రీమేక్‌కు ర‌విచంద్ర‌న్ బ్రేక్‌!

`అన్నియ‌న్‌` రీమేక్‌కు ర‌విచంద్ర‌న్ బ్రేక్‌!
`అన్నియ‌న్‌` రీమేక్‌కు ర‌విచంద్ర‌న్ బ్రేక్‌!

కొద్ది రోజుల క్రితం దర్శకుడు శంకర్ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి `అన్నియ‌న్` రీమేక్‌ని చేయ‌బోతున్న‌ట్టుగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. 2005లో చియాన్ విక్ర‌మ్ న‌టించిన `అన్నియ‌న్‌` త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. తెలుగులో `అప‌రిచితుడు` పేరుతో విడుద‌లైన ఈ మూవీ సంచ‌ల‌నం సృష్టించింది.

తెలుగులో విక్ర‌మ్‌కు తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇదే చిత్రాన్ని ఇన్నేళ్ల త‌రువాత ద‌ర్శ‌కుడు శంక‌ర్ హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్‌తో రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో వివాదం మొద‌లైంది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్ ర‌విచంద్ర‌న్ త‌న‌ని సంప్ర‌దించ‌కుండా, త‌న అనుమ‌తి లేకుండా ఎలా రీమేక్ చేస్తావ‌ని, ఈ మూవీ స‌ర్వ‌హ‌క్కులు త‌న‌వే న‌ని శంక‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

అయితే `అన్నీయన్`కు క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం తానేన‌ని ఇందులో ఎవ‌రికి ఎలాంటి భాగ‌స్వామ్యం లేద‌ని, క‌థ‌కు సంబంధించిన హ‌క్కులు త‌న‌కే వున్నాయ‌ని శంక‌ర్ త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన ర‌విచంద్ర‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ వివాదం ఇప్పుడు సౌత్ ఇండియన్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ దృష్టికి వెళ్లింది. అందులో శంక‌ర్‌పై నిర్మాత రవిచంద్రన్ ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిఐసిసి చైర్మన్ రవి కొట్టారకర ఈ విషయాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All