
`వరల్డ్ ఫేమస్ లవర్` తరువాత రాశిఖన్నాకు తెలుగులో మరో మూవీ దక్కలేదు. దీంతో ఎలాగైనా మరో చిత్రాన్ని దక్కించుకోవాలని ఎడా పెడా హాట్ ఫొటోషూట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రాశిఖన్నా. ఆమె ప్రయత్నాలు ఫలించి `పక్కా కమర్షియల్` చిత్రంలో అవకాశం లభించింది. `ప్రతి రోజు పండగే` చిత్రంలో ఏంజిల్ ఆర్నాగా రాశిఖన్నాని సరికొత్త పాత్రలో ప్రజెంట్ చేసిన మారుతి మరో సారి `పక్కా కమర్షియల్` మూవీలో అవకాశం ఇచ్చాడు.
గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే రాశిఖన్నా తెలుగులో మరో బంపర్ ఆఫర్‌ని సొంతం చేసుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ `థ్యాంక్యూ` పేరుతో ఓ విభిన్నమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత కొన్ని రోజులుగా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇటీవలే ఉభయ గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకుంది.
ఇందులో హీరోయిన్‌గా ముందు ఇస్మార్ట్ గాళ్ నభానటేష్‌ని అనుకున్నారు అయితే ఫైనల్‌గా ఆ అవకాశం రాశీఖన్నాని వరించింది. `వెంకీ మామ`లో చైతూతో కలిసి తొలిసారి రాశీఖన్నా నటించిన విషయం తెలిసిందే. ఇది వీరిద్దరి కలయికలో రానున్న రెండవ చిత్రం.