Homeగాసిప్స్`83`పై అది రూమ‌రే అంట‌!

`83`పై అది రూమ‌రే అంట‌!

`83`పై అది రూమ‌రే అంట‌!
`83`పై అది రూమ‌రే అంట‌!

1983 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం `83`. భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలి క‌ప్‌ని అందించిన ఘ‌ట్ట‌మ‌ది. ఆ ఉద్విగ్న క్ష‌ణాల నేప‌థ్యంలో అప్ప‌టి టీమ్‌కి సార‌థ్యం వ‌హించిన క‌పిల్‌దేవ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్న విష్ణు వర్ధ‌న్ ఇందూరి, ఫాంట‌మ్ ఫిల్మ్స్, క‌బీర్‌ఖాన్, దీపిక ప‌దుకునే, సాజిద్ న‌దియావాలా నిర్మిస్తున్నారు.

ర‌ణ్‌వీర్‌సింగ్‌, దీపిక ప‌దుకునే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో క‌పిల్‌దేవ్‌గా ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టించ‌గా ఆయన భార్యగా రోమీ భాటియా పాత్ర‌లో దీపికా ప‌దుకునే న‌టిస్తోంది. ప్ర‌ధాన భార‌తీయ భాషల‌తో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ఏప్రిల్ 10న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డంది.

- Advertisement -

అయ‌మితే  చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయ‌బోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఈ చిత్రానికి 143 కోట్లు చెల్లిస్తామంటూ ఆఫ‌ర్ కూడా ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని చిత్ర వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చాయి. త‌మ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తామ‌ని, ప‌రిస్థితి మ‌రో ఆరు నెల‌లు ఇలాగే వుంటే సినిమా రిలీజ్ పై అప్పుడు ఆలోచిస్తామ‌ని వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All