Homeటాప్ స్టోరీస్దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!

దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!

దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!
దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!

బాలీవుడ్‌లో రెబ‌ల్ సిస్ట‌ర్స్‌గా కంగ‌న ర‌నౌత్‌, రంగోలి చందేల్‌కు పేరుంది. ఈ ఇద్దరిలో ఎవ‌రిని విమ‌ర్శించినా మ‌రొక‌రు విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా కంగ‌న ర‌నౌత్‌ని విమ‌ర్శిస్తే మాత్రం రంగోలి రంగంలోకి దిగి ర‌ఫాడించేస్తుంది. అందుకే బాలీవుడ్‌లో ఎవ‌రూ వీళ్ల‌ని విమ‌ర్శించడానికి సాహ‌సించ‌రు. గత కొంత కాలంగా కంగ‌న కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తోంది ఆమె సిస్ట‌ర్ రంగోలి చందేల్‌. కంగ‌న‌ని ఎవ‌రు టార్గెట్ చేసినా వారిపై విరుచుకుప‌డుతూ బాలీవుడ్‌లో గత కొంత కాలంగా రంగోలి వార్త‌ల్లో నిలుస్తొంది. ఇటీవ‌ల `సాండ్ కీ ఆంఖ్‌` సినిమా విష‌యంలో తాప్సీని టార్గెట్ చేసిన రంగోలి వ‌రుస ట్వీట్‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిపిందే.

అలాంటి రంగోలి తొలిసారి దీపికా ప‌దుకోనే పై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించ‌డం బాలీవుడ్ శ్రేణుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది. దీపిక న‌టించిన తాజా చిత్రం `ఛ‌పాక్‌`. మేఘ‌నా గుల్జార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ య‌దార్థ గాధ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. దీపిక ఈ చిత్రంలో మాల‌తిగా యాసిడ్ దాడికి బ‌లైన యువ‌తిగా న‌టిస్తోంది. ఆ మ‌ధ్య రిలీజ్ చేసిన దీపిక ఫ‌స్ట్‌లుక్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో దీపిక ప్ర‌ద‌ర్శ‌న న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ని సైతం ఆక‌ట్టుకుంటోంది. దీంతో దీపిక‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

- Advertisement -

ఈ ట్రైల‌ర్‌లో దీపిక లుక్‌, న‌ట‌న చూసిన కంగ‌న సిస్ట‌ర్ రంగోలి చందేల్ `వాహ్ అద్భుతం అంటూ కితాబిచ్చింది. `ఈ సినిమా ద్వారా మేఘ‌నా గుల్జార్‌, దీపికా ప‌దుకోనే ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటార‌ని, యాసిడ్ దాడి త‌రువాత నేను, నా కుటుంబం ఎంత‌టి న‌ర‌కాన్ని అనుభ‌వించామో ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని, యాసిడ్ దాడికి గురైన ఓ యువ‌తి ఎలాంటి న‌ర‌క‌యాత‌న‌ను అనుభ‌వించిందో ఈ లోకానికి తెలియాల‌ని, అంతా ఈ చిత్రాన్ని చూడాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని` ట్వీట్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All