Homeటాప్ స్టోరీస్బాలీవుడ్‌కు వెళుతున్న మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌!

బాలీవుడ్‌కు వెళుతున్న మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌!

బాలీవుడ్‌కు వెళుతున్న మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌!
బాలీవుడ్‌కు వెళుతున్న మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌!

బాలీవుడ్ హీరోల క‌న్ను తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌పై ప‌డింది. తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్నిసాధించిన `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్నారు షాహీద్‌కపూర్‌. ఈ మూవీతో ఏకంగా త‌న రెమ్యున‌రేష‌న్‌ని 35 కోట్ల‌కు పెంచుకున్నారు. ఆ త‌రువాత కూడా `జెర్సీ` రీమేక్‌ని తానే చేస్తూ బాలీవుడ్‌లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌కి రెడీ అయిపోతున్నాడు.

ఇదిలా వుంటే షాహీద్ క‌పూర్‌ని ఎన‌ర్జీటిక్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ కూడా ఫాలో అవుతున్నాడు. ఎన్టీఆర్ న‌టించిన `టెంప‌ర్‌` ఆధారంగా రూపొందిన `సింబా` చిత్రంలో ర‌ణ్‌వీర్ న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో మ‌రో తెలుగు రీమేక్‌లో న‌టించ‌డానికి రెడీ అయిపోతున్నాడు. తెలుగులో రామ్ హీరోగా న‌టించిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. పూరి జ‌గ‌న్నాథ్ కు ద‌ర్శ‌కుడిగా పూర్వ వైభ‌వాన్ని తెచ్చిన చిత్ర‌మిది. హీరోగా రామ్ కెరీర్ ని కూడా మ‌లుపుతిప్పింది.

- Advertisement -

ఇదే చిత్రాన్ని ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హిందీలో రీమేక్ చేయ‌బోతోంది. ఇందులో రామ్ పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ న‌టించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే చిత్ర బృందం ర‌ణ్‌వీర్‌సింగ్‌తో చ‌ర్చ‌లు మొద‌లుపెట్టార‌ని, త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాబోతోంద‌ని తాజా ప్యూస్‌. ద‌ర్శ‌కుడు ఎవరు?, ర‌ణ్‌వీర్‌కు జోడీగా న‌టించే ఇద్ద‌రు భామ‌లు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All