Homeన్యూస్రంగుపడుద్ది రివ్యూ

రంగుపడుద్ది రివ్యూ

రంగుపడుద్ది రివ్యూ
రంగుపడుద్ది పోస్టర్

రంగుపడుద్ది రివ్యూ
నటీనటులు : అలీ , ధన్ రాజ్ , హీనా
సంగీతం : సుభాష్ ఆనంద్
నిర్మాత : మహేష్ రాఠీ
సమర్పణ : కిషోర్ రాఠీ
దర్శకత్వం : శ్యామ్ ప్రసాద్
రేటింగ్ : 3/5

 

- Advertisement -

తెలుగునాట సంచలన విజయాలను సాధించిన ఎన్నో చిత్రాలను నిర్మించిన ఘన చరిత్ర మనీషా ఆర్ట్స్ బ్యానర్ ది . కిషోర్ రాఠీ సమర్పణలో మహేష్ రాఠీ నిర్మించిన రంగుపడుద్ది మే 3న విడుదల అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా ?

కథ :
దారిద్య్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రామ్ (అలీ )తక్కువ రేటుకే అమ్ముకున్న భూములను తలచుకొని బాధపడుతుంటాడు . రామ్ తో పాటుగా కష్టాలను అనుభవిస్తున్న అతడి స్నేహితులు కూడా తమ దురదృష్టాన్ని దూరం చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు . అదే సమయంలో అయ్యర్ ( రఘుబాబు )మీరంతా టైం మిషన్ సహాయంతో కాలంలో ప్రయాణించవచ్చని చెప్పి నమ్మిస్తాడు . అలా నమ్మించి అర్ధరాత్రి ఓ దయ్యాల బంగళాకు రప్పిస్తాడు . ఆ దయ్యలా బంగాళాలోకి వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చారా ? అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

నటీనటులు :
అలీ , ధన్ రాజ్ , హీనా , జబర్దస్త్ అప్పారావు , షేకింగ్ శేషు , పొట్టి చిట్టి , సుమన్ శెట్టి తమ తమ పాత్రల్లో రాణించారు , అలాగే ప్రేక్షకులను నవ్వించారు . హీరోయిన్ హీనా గ్లామర్ తో కూడా మెప్పించింది . లుక్స్ బాగున్నాయి . ముఖ్యంగా షేకింగ్ శేషు , జబర్దస్త్ అప్పారావు , సుమన్ శెట్టి బాగా నవ్వించారు . అయ్యర్ పాత్రలో రఘుబాబు మెప్పించాడు . కిశోర్ రాఠీ ఓ చిన్న పాత్రలో నటించడం విశేషం అలాగే దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో ప్రత్యేకత ఈ చిత్రానికి .

సాంకేతిక వర్గం :
మహేష్ రాఠీ నవ్వించే మంచి కథ ని ఎంచుకున్నాడు .నేపథ్య సంగీతం ఫరవాలేదు , అలనాటి సూపర్ హిట్ సాంగ్ చినుకు చినుకు అందెలతో అనే పాటని మళ్ళీ ఓసారి గుర్తుకు తెచ్చారు . విజువల్స్ బాగున్నాయి , అలాగే నిర్మాణ విలువలు కూడా . దర్శకుడు స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా : రంగు పడింది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All