Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ చిత్రాలపై రంగస్థలం ఎఫెక్ట్

టాలీవుడ్ చిత్రాలపై రంగస్థలం ఎఫెక్ట్

Rangasthalam effect on tollywoodరంగస్థలం చిత్రం ఎఫెక్ట్ టాలీవుడ్ చిత్రాలపై మాములుగా లేదు. రంగస్థలం చిత్రం 1980 కాలం నాటిది కాగా ఆ సినిమా విడుదలకు ముందు 1980 నాటి సినిమా నడుస్తుందా ? ఆ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులకు నచ్చుతుందా ? అనే డౌట్ ఉండేది కానీ రంగస్థలం చిత్రం విడుదలయ్యాక ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రంగస్థలం చిత్రం నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టి బాహుబలి తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాదు చరణ్ కెరీర్ లోనే కాకుండా అటు సమంత కు ఇటు దర్శకులు సుకుమార్ కు కూడా ఓ మైలురాయి గా నిలిచింది.

కట్ చేస్తే ….. రంగస్థలం ఇచ్చిన ఊపుతో ఇప్పుడు ఏకంగా ఓ పది చిత్రాలకు పైగా 80- 90 బ్యాక్ డ్రాప్ స్టోరీస్ వస్తున్నాయి. ఇందులో చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరూ 80 కి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యాక్ డ్రాప్ లో 10 చిత్రాల వరకు ఉండగా మరో 10 , 15 చిత్రాల వరకు కథా చర్చలలో ఉన్నాయి. అంటే 80 నాటి కథలు ఇప్పుడు రావడానికి ముమ్మాటికీ రంగస్థలం చిత్రం ఇచ్చిన ఊపే ! అయితే రంగస్థలం 1980 కాలం నాటిది కాబట్టి హిట్ కాలేదు .కథ , కథనం కుదిరాయి కాబట్టి హిట్ అయ్యింది. దాన్ని మర్చిపోయి అందరూ రంగస్థలం లాగే మాది హిట్ అవుద్ది అని అదే మార్గంలో పోతున్నారు. ఇక్కడ ఓ హిట్ వచ్చిందంటే చాలు ఆ రూట్ లోనే బోలెడు చిత్రాలు వస్తాయి ప్రేక్షకులు వాటిని తిప్పి కొట్టేవరకు . ట్రెండ్ అంటే అంతే మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All