Homeటాప్ స్టోరీస్చైనాలో విడుదల కానున్న రంగస్థలం

చైనాలో విడుదల కానున్న రంగస్థలం

rangasthalam movie release in chinaతెలుగులో సంచలన విజయం సాధించి బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలిచింది రంగస్థలం చిత్రం . చరణ్సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది . సుకుమార్ దర్శకత్వ ప్రతిభ తో పాత రికార్డులను బద్దలుకొట్టింది . ప్రపంచ వ్యాప్తంగా 127 కోట్ల షేర్ ని రాబట్టిన రంగస్థలం చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు .

చైనా లో భారతీయ సినిమాలకు డిమాండ్ పెరిగింది . బాహుబలి తో పాటుగా బాలీవుడ్ చిత్రాలు అక్కడ సత్తా చాటాయి . భారీ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇండియన్ సినిమాలు . ముఖ్యంగా అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డుల మోత మోగించింది . దాంతో రంగస్థలం చిత్రాన్ని చైనాలో విడుదల చేసి మరింతగా సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు మైత్రి మూవీస్ అధినేతలు . చరణ్ కెరీర్ లో భారీ హిట్ అవ్వడమే కాకుండా నటుడిగా విమర్శకుల ప్రశంసలు కూడా లభించడంతో చాలా సంతోషంగా ఉన్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All