Homeగాసిప్స్ఎంగేజ్‌మెంట్ డేట్ మారిందా?

ఎంగేజ్‌మెంట్ డేట్ మారిందా?

ఎంగేజ్‌మెంట్ డేట్ మారిందా?
ఎంగేజ్‌మెంట్ డేట్ మారిందా?

ద‌గ్గుబాటి రానా త‌న ప్రియురాలు మిహికా బ‌జాజ్‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌రిచ‌యం చేసిన ద‌గ్గ‌రి నుంచి వీరిద్ద‌రి వివాహంపై వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రేమ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టిన రానా త‌న వివాహం గురించి మాత్రం వెల్ల‌డించ‌లేద‌ని, బ‌హుషా వీరి వివాహంపై సురేష్‌బాబు వివ‌ర‌ణ ఇస్తార‌ని అంత‌టా ప్ర‌చారం జ‌రిగింది. అంతా అనుకున్న‌ట్టే రానా, మిహికాల వివాహంపై సురేష్‌బాబు స్పందించారు.

డిసెంబ‌ర్‌లో వివాహం వుంటుంద‌ని, లాక్‌డౌన్ త‌రువాత కీల‌క ప్ర‌క‌ట‌న వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆయ‌న చెప్పిన‌ట్టే బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు రామానాయుడు స్టూడియోస్‌లో మహీకా బ‌జాజ్‌తో రానా నిశ్చితార్థం జ‌ర‌గ‌బోతోందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేద‌ని సురేష్ బాబు వెల్ల‌డించార‌ట‌. తాజాగా గురువారం ఉద‌యం మాత్ర‌మే రానా, మిహీకాల ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని, ఆ ఫొటోల‌నే సోష‌ల్ మీడియా ద్వారా రానా షేర్ చేశార‌ని చెబుతున్నారు.

- Advertisement -

త‌నకు కాబోయే భార్య ఈమే అంటూ మిహికా బ‌జాజ్‌తో క‌లిసి వున్న ఓ ఫోటోని షేర్ చేసిన అంద‌రికి షాకిచ్చిన రానా తాజాగా త‌న ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ని కూడా తానే షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారంది. వైట్ అండ్ వైట్‌లో పెళ్లి కుమారుడిగా రానా, పెళ్లి కుమార్తె త‌ర‌హా చీర‌క‌ట్టులో మిహికా బ‌జాజ్ ఫొటోల్లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఎంగేజ్‌మెంట్‌కే ఈ ఇద్ద‌రు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు త‌ర‌హాలో ముస్తాబ‌య్యారే అని అంతా అవాక్క‌వుతున్నారు. ‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All