
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తో మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నారు.
త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోంది. అయితే ఇందులో పవన్‌తో కలిసి మరో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఫృథ్వీరాజ్‌సుకుమారన్ పోషించిన పాత్రలో రానా నటించనున్నాడంటూ వార్తలు వినిపించాయి. మేకర్స్ కూడా ఇటీవల రానాను సంప్రదించారట. టాక్స్ నడుస్తున్నాయని ఇంకా ఫైనల్ కాలేదని స్వయంగా రానానే వెల్లడించాడు.
తాజాగా రానా స్థానంలో మరో పేరు తెరపైకి వచ్చింది. హీరో గోపీచంద్ కూడా పవన్‌తో కలిసి నటించడానికి ఆసక్తిగా వున్నాడని చెబుతున్నారు. కానీ పవన్‌తో కలిసి నటించేది కన్నడ హీరో సుదీప్ అని మరో వాదన వినిపిస్తోంది. ఇటీవల సుదీప్ పవన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు కూడా. తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి రీమేక్‌ని పట్టాలెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.