
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా నిన్న మన్నటి వరకు పేరున్న రానా దగ్గుబాటి ఈ నెల 8న మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సైలెంట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ ప్రేమ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. ఈ వివాహంలో దగ్గుబాటి ఫ్యామిలీ, మిహీకా ఫ్యామిలీతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రామానాయుడు స్టూగడియోస్‌లో అత్యంత సన్నిహితులు అతి కొద్ది మంది ఆహ్వానితుల మధ్య రానా వివాహం జరిగింది. ఇదిలా వుంటే రానా వివాహానికి హాజరైన వారికి, హాజరు కాలేకపోయిన వారికీ రానా ఫాదర్ డి. సురేష్ బాబు ప్రత్యేక బహుమతులు, నూతన వధూవరులని ఆశీర్వదించమని కోరుతూ ఓ లేఖని పంపించారట.
కరోనా వైరస్ కారణంగా రానా ఫ్యామిలీ రిసెప్షన్‌ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే కరోనా తీవ్రత తగ్గిన తరువాత ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు ప్రత్యేకంగా గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారట. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం షూటింగ్‌లు నిలిచిపోవడం, విదేశాల్లో వైరస్ భీభత్సం సృష్టిస్తుండటంతో కొత్త జంట హనీమూన్ ప్రయత్నాల్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలిసింది.