Homeటాప్ స్టోరీస్ల‌వ్‌స్టోరీ బ‌య‌ట‌పెట్టిన రానా!

ల‌వ్‌స్టోరీ బ‌య‌ట‌పెట్టిన రానా!

ల‌వ్‌స్టోరీ బ‌య‌ట‌పెట్టిన రానా!
ల‌వ్‌స్టోరీ బ‌య‌ట‌పెట్టిన రానా!

టాలీవుఎడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా పేరు తెచ్చుకున్న రానా ద‌గ్గుబాటి ఆగస్టు 8న మిహీకా బ‌జాజ్ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లి గురించి ఎప్పుడు ప్ర‌స్తావించినా స‌మాధానం దాటివేసిన రానా త‌నే స్వ‌యంగా త‌ను ప్రేమ‌లో వున్నాన‌ని, ఫైన‌ల్ గా ఓ అమ్మాయి త‌న‌కు ఓకే చెప్పింద‌ని మే 12న సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే.

అయితే ఆమెతో ఎప్పుడు ప్రేమ‌లో ప‌డింది? ఎలా వారి ప్రేమ పెళ్లి పీట‌ల దాకా వ‌చ్చింది. అన్న విష‌యాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాలో మాట్లాడిన రానా త‌న ల‌వ్‌స్టోరీ ని బ‌య‌ట‌పెట్టేశాడు. బాలీవుడ్ హీరోయిన్ నేహా దూపినా నిర్వ‌హిస్తున్న `నో ఫిల్ట‌ర్ విత్ నేహా` కార్య‌క్ర‌మంలో రానా త‌న ల‌వ్ స్టోరీ గు్టు విప్పేశారు. కోవిడ్ స్వైర విహారం చేస్తున్న స‌మ‌యంలో రానా – మిహీకా ల వివాహం జ‌రిగింది. భారీ స్థాయిలో వివాహం చేసుకోవాల‌ని ప్లాన్ చేసినా క‌రోనా వైర‌స్ కార‌ణంగా అతి కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల మ‌ధ్యే వివాహం చేసుకోవాల్సి వ‌చ్చింది.

- Advertisement -

మిహీకా, రానా సిస్ట‌ర్ క‌లిసి స్కూల్‌కి వెళుతున్న టైమ్ నుంచే తెలుస‌ట‌. అయితే కాల క్ర‌మేనా వారు హైద‌రాబాద్ నుంచి ముంబై వెళ్లార‌ట‌. అయినా త‌నకు ట‌చ్‌లోనే వుంటూ వ‌చ్చాడ‌ట రానా. లాక్‌డౌన్ టైమ్‌లో త‌న‌కున్న చ‌నువుతో మిహీకాకు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ఇంకే ముంది మిహీకా కూడా య‌స్ అనేయ‌డంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All