Homeటాప్ స్టోరీస్శివ‌గామి 50 లోకి ఎంట‌ర‌య్యారండోయ్‌!

శివ‌గామి 50 లోకి ఎంట‌ర‌య్యారండోయ్‌!

శివ‌గామి 50 లోకి ఎంట‌ర‌య్యారండోయ్‌!
శివ‌గామి 50 లోకి ఎంట‌ర‌య్యారండోయ్‌!

నీలాంబ‌రిగా `న‌ర‌సింహ‌` సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌నే డామినేట్ చేసింది ర‌మ్య‌కృష్ణ‌. నీలాంబిరి పాత్ర‌ని త‌న‌దైన స్లైల్లో ర‌క్తిక‌ట్టించి ఔరా అనిపించింది. ఆ పాత్ర రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి`లో శివ‌గామి పాత్ర‌ని తెచ్చిపెట్టిందంటే ర‌మ్య‌కృష్ణ ఏ స్థాయిలో ఆ పాత్ర‌ని ఆడుకుందో అర్థం చేసుకోవ‌చ్చు. శివ‌గామి దేవిగా `బాహుబ‌లి` ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని ద‌క్కించుకుంది.

ద‌శాబ్దాలుగా హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్తిస్ట్‌గా త‌న దైన ముద్ద‌ని వేసిన ర‌మ్య‌కృష్ణ ఈ రోజు (మంగ‌ళ‌వారం) పుట్టిన రోజు జ‌రుపుకుంది. ఈ రోజుతో 50 లోకి ఎంట‌రైంది. భ‌ర్త, ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీతో పాటు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అత్యంత సాదా సీదాగా పుట్టిన రోజు వేడుక‌ని జ‌రుపుకుంది ర‌మ్య‌కృష్ణ‌. ఈ సంద‌ర్భంగా త‌న పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది.

- Advertisement -

యాభైయ సంవ‌త్స‌రంలోకి ఎంట‌ర‌య్యాన‌ని వెల్ల‌డించిన ర‌మ్యకృష్ణ ఫ్యామిలీతో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాన‌ని, ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని వెల్ల‌డించింది. ఆమె జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించిన `క్వీన్‌` వెబ్ సిరీస్ సంచ‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. గౌత‌మ్ మీన‌న్ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All