Homeటాప్ స్టోరీస్డించ‌క్ డించ‌క్ అంటూ అద‌ర‌గొట్టేస్తున్న రామ్‌, హెబా!

డించ‌క్ డించ‌క్ అంటూ అద‌ర‌గొట్టేస్తున్న రామ్‌, హెబా!

డించ‌క్ డించ‌క్ అంటూ అద‌ర‌గొట్టేస్తున్న రామ్‌, హెబా!
డించ‌క్ డించ‌క్ అంటూ అద‌ర‌గొట్టేస్తున్న రామ్‌, హెబా!

కిషోర్ తిరుమ‌ల, ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం `రెడ్‌`. `నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ వంటి హిట్ చిత్రాల త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ‌వ చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. పైగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డం, రామ్ ఈ త‌ర‌హా జోన‌ర్లో  న‌టిస్తున్న తొలి చిత్రం కావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది.

మాళ‌విక‌శ‌ర్మ‌, నివేదా పేతురాజ్, అమృతా అయ్య‌ర్ ఇందులో క‌థానాయికలుగా న‌టించారు. `ఇస్మార్ట్ శంక‌ర్` వంటి మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ త‌రువాత క్లాస్‌ని మాస్‌ని ఆక‌ట్టుకునే స్టోరీతో ఈ మూవీని తెర‌కెక్కించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం హెబ్బా ప‌టేష్‌, రామ్ పాల్గొన‌గా ఓ మాస్ మ‌సాలా సాంగ్‌ని చిత్రీక‌రించారు. బుధ‌వారం ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం సోష‌ల్ మీడియా ద్వారా ‌విడుద‌ల చేసింది.

- Advertisement -

డించ‌క్ డించ‌క్ అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్‌ని కాస‌ర్ల శ్యామ్ రాశారు. సాకేత్‌, కీర్త‌నా శ‌ర్మ ఆల‌పించిన ఈ పాటకు .జానీ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇప్ప‌టికే ఈ లిరిక‌ల్ వీడియో యూట్యూబ్‌లో సంద‌డి చేస్తోంది. ఈ పాట‌లో రామ్ ఎన‌ర్జీతో పాటు మాస్‌ స్టెప్పుల‌తో అర‌ద‌గొట్టేశారు. థియేట‌ర్ల‌లో ఈ పాటుకు విజిల్స్ ప‌డ‌టం గ్యారెంటీ . సినిమాలో వ‌చ్చే ఫ‌స్ట్ సాంగ్ ఇది అని, ప్రేక్ష‌కుల అంచనాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో 6 రోజుల పాటు ఈ పాట‌ని చిత్రీక‌రించామ‌ని నిర్మాత స్ర‌వంతి ర‌వికిషోర్ అన్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All