Homeటాప్ స్టోరీస్మిగిలిన వారికి ఒక జూదం - హీరో రామ్‌

మిగిలిన వారికి ఒక జూదం – హీరో రామ్‌

మిగిలిన వారికి ఒక జూదం - హీరో రామ్‌
మిగిలిన వారికి ఒక జూదం – హీరో రామ్‌

లాక్‌డౌన్ కార‌ణంగా తెలుగు సినిమా చూట్టూ ఓటీటీ ర‌చ్చ జ‌రుగుతోంది. క‌రోనా వైర‌స్ నానాటికీ పెరుగుతుండ‌టంతో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ పిరియ‌డ్‌ని పెంచేస్తున్నాయి. తాజాగా ఈ నెల 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ని పెంచేయ‌డంతో సినిమాల రిలీజ్‌లు ప్ర‌శ్నార్థకంగా మారాయి. థియేట‌ర్లు ఓపెన్ చేస్తేనే సినిమాల రిలీజ్‌లు మొద‌ల‌వుతాయి.

కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు మ‌రో మూడు నుంచి నాలుగు నెల‌ల త‌రువాతే ఓపెన్ చేసే అవ‌కాశం వుండ‌టంతో చాలా మంది త‌మ చిత్రాల్ని డైరెక్ట్ ఓటీటీకి అమ్మేస్తున్నారు. దీంతో సినీ ఇండ‌స్ట్రీల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే బాలీవుడ్ నుంచి చాలా చిత్రాలు డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాలు కూడా వ‌చ్చే నెల నుంచి ఓటీటీ ప్లాట్ ఫాహ్ల‌లో అందుబాటులోకి ర‌కాబోతుండ‌టంతో తెలుగు సినిమాల‌పై ఒత్తిడి మొద‌లైంది. దీన్ని అద‌నుగా తీసుకున్నప‌లు ఓటీటీ కంపెనీలు తెలుగు సినిమాల‌పై ఒత్తిడి పెంచ‌డం, టెమ్టింగ్ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఎన‌ర్జిటిక్ హీరో రామ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివాదాస్ప‌ద అంశాల‌కు దూరంగా వుండే రామ్ తాజాగా ఓటీటీ, థియేట‌ర్ ర‌చ్చ‌పై ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `మూవీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన విష‌యం ఏమిటంటే.. ఇది కొద్ది మందికి ఒక అభిరుచి.. చాలా మందికి వ్యాపారం. మిగిలిన వారికి ఒక జూదం.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ సొంత కోణం నుండి చూస్తారు` అని హీరో రామ్ చేసిన ట్వీట్ చ‌ర్చ‌కు దారితీసేలా వుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All