Homeటాప్ స్టోరీస్ఇస్మార్ట్ రామ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌‌!

ఇస్మార్ట్ రామ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌‌!

ఇస్మార్ట్ రామ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌‌!
ఇస్మార్ట్ రామ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌‌!

రామ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `రెడ్‌`. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. స్ర‌వంతీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. నేడు ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రామ్‌, హెబ్బా ప‌టేల్‌పై చిత్రీక‌రించిన స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో తొలిసారి రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ టూ షేడ్స్ వున్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భించిన విష‌యం తెలిసిందే. తాజాగా పుట్టిన రోజు సంద‌ర్భంగా `డించ్చిక్ డించ్చిక్‌…` అంటూ సాగే స్పెష‌ల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

- Advertisement -

రామ్ త‌న ఎన‌ర్జిటిక్ మూవ్స్‌తో ఆక‌ట్టుకోగా, హెబ్బా ప‌టేల్ త‌న గ్లామ‌ర్‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేసింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ ,చేయాల‌ని ప్లాన్ చేసినా క‌రోనా వైర‌స్ కార‌ణంగా చిత్ర బృందం ఈ చిత్ర రిలీజ్‌ని వాయ‌దా వేసింది. తాజా ప‌రిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటే గానీ ఈ చిత్రం విడుద‌ల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All