Homeటాప్ స్టోరీస్వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్' తీస్తాడట!

వర్మ ‘ఆర్జీవీ మిస్సింగ్’ తీస్తాడట!

వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్' తీస్తాడట!
వర్మ ‘ఆర్జీవీ మిస్సింగ్’ తీస్తాడట!
రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. సాంకేతికంగా వండర్స్ క్రియేట్ చేసిన వర్మ ఆ తరువాత నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. నిత్యం వివాదాస్పద అంశాలతో సినిమాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కరోనా సమయంలో షూటింగ్ లు చేయడానికి భయపడుతుంటే వర్మ మాత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఓటిటీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
దీని ద్వారా క్లైమాక్స్ , నగ్నం, పవర్ స్టార్ వంటి చిత్రాలని ఇప్పటికే ఓటిటీ ద్వారా రిలీజ్ చేశారు. 12 ఓ క్లాక్ , మర్డర్ , కరోన  థ్రిల్లర్ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇదిలా వుంటే వర్మ కొత్త జోనర్ అంటూ మరో సినిమా ప్రకటించారు. ఫిక్షనల్  , రియాలిటీ జోనర్ లో ‘ఆర్జీవీ మిస్సింగ్’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో పాత్రలని కూడా పరిచయం చేశారు.
ఈ సినిమాతో మరో కాంట్రవర్సీకి తెరలేపారు. పవన్ కళ్యాణ్ పేరుని ప్రవన్ కళ్యాణ్ గా మార్చి వాడుకున్న వర్మ ఈ సినిమాలో కూడా
ప్రవన్ కళ్యాణ్ ని వాడబోతున్నారు.  మెగాస్టార్ ని ఒమెగాస్టార్ గా , సిబిఎన్ ని సీబీఈ ఎన్ గా లోకేష్ ని లాకేష్ గా … వై ఎస్ జగన్ ని వై ఎస్ జగన్ అంటూ పరిచయం చేసాడు ఇక కేసీఆర్ ని KCAR గానూ కేటీఆర్ ను KTAR గాను పరిచయం చేశారు వర్మ. Ee పాత్రలన్నింటిని కలిపి ‘ఆర్జీవీ మిస్సింగ్’ చేయబోతున్నారు. దీనితో మారె వివాదం సృష్టిస్తారో.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All