Homeటాప్ స్టోరీస్వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?

వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?

వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?
వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?

రామ్ గోపాల్ వర్మ.. బయటకి గొప్ప ధైర్యవంతుడిలా.. ఏది పడితే అది చేసేసే వ్యక్తిలా.. తనను మించిన వాడు లేడనేలా ప్రవర్తిస్తాడు కానీ నిజానికి వర్మ కూడా భయస్తుడే. అతను భయపడకుండా కొన్ని సినిమాలు తీసుండొచ్చు కానీ భయపడి మానేసిన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. సరదాకి వర్మ మీద ఒక్క గొప్ప సెటైర్ ఇండస్ట్రీలో ఉంది. వోడ్కా మత్తులో సినిమాలు ప్రకటించే వర్మ ఆ మత్తు దిగి పొద్దున్న కాఫీ పడగానే మాట మార్చేస్తాడు అని. దీనిని వర్మ ఒప్పుకుంటాడు కూడా. చాలాసార్లు బహిరంగంగానే వోడ్కా మత్తులో చేసిన ట్వీట్ అదని చెప్పాడు. ఈ ప్రకారం వర్మ ప్రకటించి ఆపేసిన సినిమాల సంఖ్యా డజను దాటి చాలా ఏళ్లయింది. తాజాగా ఈ లిస్ట్ లో చేరిన సినిమాగా మెగా ఫ్యామిలీ చేరుతుంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రంలో వర్మ చాలా వివాదాస్పద అంశాలను జోడించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ కు పప్పు వడ్డించే సన్నివేశం విడుదల చేసిన ట్రైలర్ లో హైలైట్ అంశంగా నిలిచింది. దీన్ని కూడా కామెడీ చేస్తూ వర్మ చాలా సెటైరికల్ గా ఈ సీన్ తీసాడని అందరూ అనుకుంటున్నారు. ఐతే నిన్న ఒక టివి స్టూడియోకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక వ్యక్తితో ఫోన్ కాల్ మాట్లాడుతున్న సందర్భంగా అసలు పప్పు సీన్ కు అందరూ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలీదు అంటూ అమాయకంగా నటించే ప్రయత్నం చేసాడు. సదరు వ్యక్తి నాకా సన్నివేశం చాలా నచ్చింది, అసలు పప్పు వేయడం సూపర్ అంటుంటే వర్మ, ఎందుకని పప్పు వేస్తె ఏమైంది.. నేనేదో క్యాజువల్ గా వేయించా అంటూ అదేం తెలీనట్లు హడావిడి చేసాడు.

ఈ సినిమా సంగతి పక్కనపెడితే వర్మ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తర్వాత తాను చేయబోయే చిత్రం మెగా ఫ్యామిలీ అంటూ పెద్ద బాంబే పేల్చాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ గుస్సా అయ్యారు కూడా. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ ను అంటూ ఏదొక రకంగా కామెంట్ చేస్తూ వచ్చిన వర్మ, ఈసారి మొత్తం మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ కొంత కంగారు పడ్డారు. తమ హీరోల గురించి ఏం చూపిస్తాడోనంటూ వారు ఊహాగానాలు కూడా మొదలుపెట్టారు. అయితే అంతలోనే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తాను చేయట్లేదని చెప్పి మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా చేసాడు. మెగా ఫ్యామిలీ అనే సినిమా 39 మంది పిల్లల్ని కన్న ఒక వ్యక్తి కథ. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టాను. కానీ నేను చిన్న పిల్లల సినిమాలు తీయను కాబట్టి ఈ సినిమాను పక్కనపెట్టేసాను అంటున్నాడు. మరి అలాంటప్పుడు అసలు ప్రకటించడం దేనికంటూ సదరు యాంకర్ అడుగగా డబల్ వోడ్కా పెగ్ లో ట్వీట్ చేశాను. పొద్దున్న కాఫీ తాగగానే సినిమా చేయకూడదనుకున్నానని కవర్ చేసుకునే ప్రయత్నం చేసాడు. కానీ వర్మ భయపడ్డాడని, మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చని, దానికి భయపడే వర్మ ఈ సినిమా తీసే ప్రయత్నం మానుకున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో రామ్ గోపాల్ వర్మకే తెలియాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All