Homeటాప్ స్టోరీస్బెస్ట్ గిఫ్ట్ ఇస్తాన‌ని మాటిస్తున్నా- రామ్‌చ‌ర‌ణ్‌

బెస్ట్ గిఫ్ట్ ఇస్తాన‌ని మాటిస్తున్నా- రామ్‌చ‌ర‌ణ్‌

బెస్ట్ గిఫ్ట్ ఇస్తాన‌ని మాటిస్తున్నా- రామ్‌చ‌ర‌ణ్‌
బెస్ట్ గిఫ్ట్ ఇస్తాన‌ని మాటిస్తున్నా- రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల మెగా హీరో రామ్‌చ‌ర‌న్ పుట్టిన రోజు కానుక‌గా భీం ఫ‌ర్ రామ‌రాజు వీడియోని రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేశారు. అదే స్థాయిలో ఎన్టీఆర్ పుట్టిన రోజున నంద‌మూరి అభిమానుల‌కు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా రామ‌రాజు ఫ‌ర్ భీం వీడియోని రిలీజ్ చేస్తార‌ని అంతా భావించారు.

కానీ అందుకు త‌గ్గ ఫుటేజ్ లేక‌పోవ‌డం, లాక్‌డౌన్ పిరియ‌డ్ కావ‌డంతో `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియో ని విడుద‌ల చేయ‌డం లేద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ లో పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. ఎర్టీఆర్‌తో క‌లిసి వున్న ఫొటోని షేర్ చేసిన రామ్‌చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు.

- Advertisement -

`నా ప్రియ‌మైన సోద‌రుడు ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. నీకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని నాకు తెలుసు. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాన‌ని మాటిస్తున్నా. ఆ వేడుక‌లు ముందున్నాయంటూ ఎన్టీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా జ‌క్క‌న్న కూడా స్పందించారు. `ప్రారంభం నుంచి నా ప్ర‌యాణంలో భాగ‌మైనందుకు సంతోష‌ప‌డుతున్నాను. హ్యాపీ బ‌ర్త్‌డే తార‌క్. భీం పాత్ర‌కు నీ కంటే ఉత్త‌మ న‌టుడు నాకు దొర‌క లేదు` అని స్పందించారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All