Homeగాసిప్స్రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి కామన్ టైటిల్ ఫిక్స్ చేసారా?

రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి కామన్ టైటిల్ ఫిక్స్ చేసారా?

రామ్ చరణ్ - శంకర్ చిత్రానికి కామన్ టైటిల్ ఫిక్స్ చేసారా?
రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి కామన్ టైటిల్ ఫిక్స్ చేసారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా ఈరోజు అధికారికంగా లాంచ్ కానుంది. నిన్ననే రామ్ చరణ్, శంకర్ ఇంకా కీలక కాస్ట్ అండ్ క్రూలకు బ్లాక్ కోట్లు, బ్లాక్ గాగుల్స్ పెట్టి ఫోటోషూట్ కూడా చేసారు. ప్రాధాన్యమున్న కాస్ట్ అండ్ క్రూ వివరాలను ఇప్పటికే తెలియజేసారు.

ఇదిలా ఉంటే ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు ఒక కామన్ టైటిల్ ను శంకర్ ఫిక్స్ చేసాడని తెలుస్తోంది. విశ్వంభర అనే టైటిల్ ను ఈ చిత్రానికి అనుకుంటున్నారట. దీనిపై అందరూ పాజిటివ్ గా ఉన్నారని త్వరలోనే అధికారికంగా రివీల్ చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -

2023లో విడుదల కానున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం అవుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుండగా థమన్ సంగీతం అందిస్తాడు. దిల్ రాజు – శిరీష్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All