Homeటాప్ స్టోరీస్ఆచార్య షూట్ లో జాయిన్ అయిన రామ్ చరణ్

ఆచార్య షూట్ లో జాయిన్ అయిన రామ్ చరణ్

ఆచార్య షూట్ లో జాయిన్ అయిన రామ్ చరణ్
ఆచార్య షూట్ లో జాయిన్ అయిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో కూడా రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆచార్యలో స్టూడెంట్ లీడర్ రోల్ పాత్రను పోషిస్తున్నాడు. సిద్ధగా కనిపించనున్న చరణ్ ఈరోజు నుండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ రెండు పాటలు తప్ప చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆచార్య షూటింగ్ కు మళ్ళీ డేట్స్ ఇచ్చాడు. చిరంజీవి పాత్రకు శిష్యుడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు రామ్ చరణ్.

- Advertisement -

ఈ షెడ్యూల్ తో తన పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఆచార్య చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All