
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి సినిమా చేస్తానంటున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించాలని ప్లాన్ చేసాడు. మొన్నటిదాకా ఈ ప్రాజెక్ట్ పై బోలెడన్ని రూమర్లు ఉన్నా కానీ అవన్నీ రీసెంట్ గా పటాపంచలయ్యాయి.
శంకర్ ఇంట్లో వీరి ముగ్గురికీ మీటింగ్ జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. శంకర్ కు ఉన్న లీగల్ చిక్కులు కూడా వీడిపోవడంతో ఈ భారీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. వచ్చే నెల నుండి ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటిదాకా శంకర్ సినిమాలు అన్నీ క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమాలే. అయితే చరణ్ చిత్రంతో మాత్రం మాస్ ను ప్రధానంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ అంశాలు పుష్కలంగా ఈ చిత్రంలో ఉన్నాయిట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు తెలుస్తాయి.