Homeటాప్ స్టోరీస్బిగ్ అనౌన్స్‌మెంట్ వెన‌కుంది మెగా హీరోనా?

బిగ్ అనౌన్స్‌మెంట్ వెన‌కుంది మెగా హీరోనా?

బిగ్ అనౌన్స్‌మెంట్ వెన‌కుంది మెగా హీరోనా?
బిగ్ అనౌన్స్‌మెంట్ వెన‌కుంది మెగా హీరోనా?

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న విష‌యం తెలిసిందే. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు ఈ చిత్రాన్ని స‌రెండ‌ర్ 2 సినిమా బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్‌ని అందిస్తున్నారు.

బుధ‌వారం ఈ చిత్రానికి సంబంధించిన మేక‌ర్స్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కావ‌డానికి వెన‌క మెగా హీరో వున్నార‌ని తెలిసింది. మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ కార‌ణంగానే అఖిల్‌తో సురేంద‌ర్‌రెడ్డి స్పై థ్రిల్ల‌ర్ చేయ‌డానికి అంగీక‌రించార‌ని తెలిసింది. ముందు రామ్‌చ‌ర‌ణ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌తో సినిమా చేయాల‌ని సురేంద‌ర్‌రెడ్డి ప్ర‌య‌త్నాలు చేశారు.

- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌`లో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇక ప‌వ‌ర్‌స్టార్‌తో ఓ మూవీ సెట్ట‌యింది. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ మూవీ ప‌ట్టాలెక్కాలంటే మ‌రో ఏడాది పైనే ఎదురుచూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో అఖిల్‌తో సినిమా చేస్తే బాగుంటుంద‌ని రామ్‌చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ సెట్ చేశార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All