Homeటాప్ స్టోరీస్స్టార్ హీరో ఫొటో గ్రాఫ‌ర్‌గా మారారు!

స్టార్ హీరో ఫొటో గ్రాఫ‌ర్‌గా మారారు!

స్టార్ హీరో ఫొటో గ్రాఫ‌ర్‌గా మారారు!
స్టార్ హీరో ఫొటో గ్రాఫ‌ర్‌గా మారారు!

ద‌ర్శ‌కుడు స్టార్ట్ యాక్ష‌న్, కెమెరా రోలింగ్ అన‌గానే కెమెరా ముందు యాక్ష‌న్ చేసే స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ ఉన్న‌ట్టుండి కెమెరా వెక్కి వెళ్లిపోవ‌డామే కాకుండా తానే ఓ కెమెరామెన్‌గా మారిపోవ‌డం ఆస‌క్తిని కేకెత్తిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. వ‌ణ్య ప్రాణి సంర‌క్ష‌ణ కోసం ఫండ్‌ని క‌లెక్ట‌ట్ చేయ‌డం కోసం హీరో రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న త్వ‌ర‌లో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు. `వైల్డెస్ట్ డ్రీమ్స్` పేరుతో రామ్‌చ‌ర‌ణ్ రీమోడ‌ల్ చేసిన త‌న నివాసంలో ఓ షెల్‌ని ఏర్పాటు చేశారు. దీని కోసం తొలిసారి హీరో రామ్‌చ‌ర‌ణ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మార‌బోతున్నారు.

త‌నుప్ర‌త్యేకంగా తీసిన చిరుత‌, జిరాఫీ, లైయ‌న్ త‌దిత‌ర వ‌ణ్య ప్రాణుల ఫొటోల్ని`వైల్డెస్ట్ డ్రీమ్స్`లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏర్పాటు చేయ‌బోతున్నారు. దీని ద్వారా వ‌ణ్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌ణ క‌ల్పించ‌బోతున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌తో పాటు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్స్ షాజ్ జంగ్‌, ఇజాజ్ ఖాన్‌. ఇషితా సాల్గావ్‌క‌ర్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోబోతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న‌ జంతు సంర‌క్ష‌ణ కోసం 1961లో వ‌ర‌ల్డ్ వైడ్ ఫండ్ పేరుతో ఓ ఆర్గ‌నైజేష‌న్ ఏర్ప‌డింది. 60 ఏళ్ల క్రితం ఏర్ప‌డిన ఈ ఆర్గ‌నైజేష‌న్‌లో వివిధ దేశాల‌కు చెందిన ఐదు నిలియ‌న్‌ల మంది స‌భ్యులుగా వున్నారు.

- Advertisement -

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 2500 జాతుల పుష్మించే మొక్క‌లు, దాదాపు 290 ర‌కాల ప‌క్షులు, ఇవే కాకుండా 4000 ర‌కాల క్రిమి కీట‌కాలున్నాయి. మారుతున్న కాలాన్ని, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వీటి ఆవాసాల్ని ర‌క్షించాల్సిన అవ‌స‌రం ఎంతో వుంది. వీటిని ర‌క్షించ‌డం ద్వారా స్థానికి స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డుతున్న స‌హ‌జ వ‌న‌రుల్ని కాపాడుకున్న వాళ్లం అవుతాం. వ‌న్య ప్రాణుల ర‌క్ష‌ణ ప‌ట్ల త‌న అభిరుచిని వ్య‌క్తం చేయ‌డం కోసం కెమెరాను ఎంచుకున్నాన‌ని, వాటిని ర‌క్షించ‌డం ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త. త‌న వంతు బాధ్య‌త‌గా ప్ర‌జ‌ల‌ని చైత‌న్య ప‌రచ‌డానికి ముందుకొచ్చాన‌ని ఈ ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ వెల్ల‌డించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All