Homeటాప్ స్టోరీస్పూరి కి రామ్....బిగ్ బి కి రామ్ చరణ్.... బహుమతులు

పూరి కి రామ్….బిగ్ బి కి రామ్ చరణ్…. బహుమతులు

Amitabh Puri
Amitabh Puri

ఏదైనా పండగ వస్తే బహుమతులు పంచుకోవటం మరియు మన ఆత్మీయ బంధాల విలువలని పెంచుకోవటం చూస్తేనే ఉంటాము. కానీ మన సినిమా పరిశ్రమ విషయంలో కూడా ఇలాంటి బహుమతులు పంచుకుంటారు. మరి దానికి పండగ కావాలా? అంటే ఏమి అవసరం లేదు సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు, లేదా మంచి పని కోసం చేసిన మేలు అయినా చాలు  అదే పెద్ద పండగ లాగ భావిస్తారు ప్రతి ఒక్కలు.

మొదట బిగ్ బి- రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి. బిగ్ బి అంటే మన ఇండియన్ సూపర్ స్టార్ “అమితాబ్ బచ్చన్” గారు. రేపు విడుదల అవుతున్న ‘సైరా’ సినిమాలో చిరంజీవి గురువుగా ‘గోసాయి వెంకన్న’ పాత్రలో ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారు అంటే అది మన సినిమాలా మీద ఉన్న నమ్మకం, చిరు-రామ్ చరణ్ మీద ఉన్న ఆత్మీయ బంధం విలువ అని చెప్పవచ్చు.

- Advertisement -

మరి రామ్ చరణ్ కూడా ఒక్కరూపాయి ఇవ్వకుండా ఊరుకున్నాడా అంటే, బిగ్ బి కి అదిరిపోయే గిఫ్ట్ ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ లగ్జరీ కారుని ఇచ్చారు. నిజంగా ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. అలాగే ఇంకొక జంట పూరి-రామ్ కూడా ఇలా బహుమతులు పంచుకున్నారు. ఈ ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్‘ రూపంలో రామ్ కి అదిరిపోయే, కెరీర్ లో గుర్తుండే పోయే గిఫ్ట్ ఇచ్చిన ‘పూరి జగన్నాధ్’ గారి పుట్టిన రోజు సెప్టెంబర్ 28.

ఇక రామ్ కూడా పూరి గారికి ‘గోల్డ్ ఫాంట‌మ్ స్పీక‌ర్‌’ అనగా ‘వైర్‌లెస్ బెస్ట్ స్పీక‌ర్‌’ గిఫ్ట్ గా ఇచ్చారు. దీని ఖరీదు అక్షరాలా మూడు ల‌క్షలు విలువ. ఆ గిఫ్ట్ ని అందుకున్న పూరి జ‌గ‌న్నాథ్ `ల‌వ్ యు రామ్` అంటూ ఇస్మార్ట్ శంకర్ లోని పాటలు పెట్టుకొని తెగ గంతులు వేశారు. ఆ వీడియో ని ‘ఛార్మి’ గారు తీశారు.

ఇలా అనుకోకుండా ఇద్దరు  గురు తమ గురువులకు ‘బహుమతులు బహుకరించడం బహుబాగు’ అంటున్నారు అభిమానులు, సినిమా వర్గాలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All