Homeటాప్ స్టోరీస్ఏయిర్ పోర్ట్‌లో ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

ఏయిర్ పోర్ట్‌లో ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

ఏయిర్ పోర్ట్‌లో ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!
ఏయిర్ పోర్ట్‌లో ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు ఇటీవ‌ల బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదంలో టాలీవుడ్ నుంచి ప్ర‌ధ‌మంగా వినిపించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణంగా వివాదంలో చిక్కుకున్న ర‌కుల్ కు విచార‌ణ నిమిత్తం ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్ ఆ త‌రువాత త‌న త‌ప్పేమీ లేద‌ని, త‌న‌కు డ్ర‌గ్స్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డంతో ఆమెకు కొంత రిలీఫ్ ల‌భించింది.

ఆ త‌రువాత నుంచి క్రిష్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న ర‌కుల్ సెట్లో సంద‌డి చేస్తోంది. `కండ పొలం` న‌వ‌ల ఆధారంగా ప‌క్కా గ్రామీణ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి సామిబాబా, రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్న క్రిష్ ప‌క్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే గ‌త రెండు నెల‌ల పాటు టెన్ష‌న్ టెన్ష‌న్‌తో గ‌డిపిన ర‌కుల్ తాజాగా శంషాబాద్‌ ఏయిర్ పోర్ట్‌లో చాలా కూల్‌గా ర‌నిపించింద‌. లేత రంగు హాఫ్ ష‌ర్ట్‌.. జీన్స్ ధ‌రించి చాలా కూల్‌గా క‌నిపించింది. ఫేస్ మాస్క్ ..ఫేస్ షీల్డ్ ధ‌రించి బ్లాక్ గాగుల్స్ లో స్టైలిష్ అవ‌తార్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి స‌ర్‌ప్రైజ్ చేస్తోంది. చాలా రోజుల త‌రువాత ర‌కుల్ కూల్‌గా క‌నిపించ‌డంతో ఈ ఫొలోలు వైర‌ల్ గా మారాయి. ప్ర‌స్తుతం ర‌కుల్ నితిన్‌తో `చెక్‌` చిత్రంతో పాటు త‌మిళంలో `ఇండియ‌న్ 2`లో న‌టిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All