Homeటాప్ స్టోరీస్రజనీ సార్ రాజకీయాల్లోకి వచ్చేశారు..!

రజనీ సార్ రాజకీయాల్లోకి వచ్చేశారు..!

రజనీ సార్ రాజకీయాల్లోకి వచ్చేశారు..!
రజనీ సార్ రాజకీయాల్లోకి వచ్చేశారు..!

ఒక దశాబ్ద కాలంగా అభిమానుల ఉత్కంఠకు ఆశలకు శుభం కార్డు పడింది. కొన్ని కోట్లమంది దేశవ్యాప్తంగా ఎప్పుడు.? అని ఎదురుచూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. కేవలం తన నటనతోనే కాకుండా తన జీవన విధానంతో మరియు తన సామాజిక సేవ,నిరాడంబరత, ఆధ్యాత్మికత, అన్నిటికీ మించి సముద్రమంత మంచితనం ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.

కొద్దిసేపటి క్రితం జరిగిన మీడియా సమావేశం ద్వారా రజనీకాంత్ తన రాజకీయ తెరంగేట్రం కన్ఫామ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్నడూ లేనంత ఎమోషనల్ గా మాట్లాడిన రజనీకాంత్, తమిళనాడు గత పాలకులు కరుణానిధి మరియు జయలలిత గార్ల మరణాల తర్వాత తమిళనాడులో అనేక విషయాలలో అస్థిరత శూన్యత చోటు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు.

- Advertisement -

ప్రజల లో ఉన్న అశాంతి, శూన్యం దూరం చేసి మంచి సుస్థిర పాలన అందించే దిశగా కృషి చేస్తానని తలైవర్ ప్రామిస్ చేశారు. ఇక “అన్నీ అయిన తరువాత రాజకీయాల్లోకి వస్తున్నారు…!” ప్రస్తుత సినిమా నటులు అని విమర్శకుల ప్రశ్నకు సమాధానంగా… “తన పార్టీకి ఇద్దరు నాయకులు ఉంటారని; ఒకరు పార్టీ ప్రెసిడెంట్ కాగా మరొకరు ముఖ్యమంత్రి అని రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో మరియు పదవులలో ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు అయిన పక్షంలో కూడా 50 శాతం వరకూ యువత తన పార్టీలో ప్రధాన అభ్యర్ధులుగా ఉంటారని రజినీకాంత్ స్పష్టం చేశారు.

గత తమిళనాడు ముఖ్యమంత్రి అందరూ మనసారా “ఆరింగార్ అన్నా” అని పిలుచుకునే “అన్నాదురై” గారి స్ఫూర్తితో తను ప్రజాజీవితంలో కొనసాగుతానని, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సమూలమైన మార్పు, ప్రక్షాళన తీసుకువస్తానని దానికి అందరూ సహకరించాలని రజినీకాంత్ పిలుపునిచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All