Homeటాప్ స్టోరీస్హీరోగా పరిచయం అవుతున్న రజనీకాంత్ తమ్ముడి తనయుడు

హీరోగా పరిచయం అవుతున్న రజనీకాంత్ తమ్ముడి తనయుడు

హీరోగా పరిచయం అవుతున్న రజనీకాంత్ తమ్ముడి తనయుడు
హీరోగా పరిచయం అవుతున్న రజనీకాంత్ తమ్ముడి తనయుడు

బాషా సినిమా గుర్తుందా.? అందులో… మౌనంగా కూర్చున్న రజనీకాంత్ ముందు నిలబడి; అన్నయ్యా … నువ్వు ఎవరు.? బాంబే లో ఏం చేసేవాడివి.? హింసా ప్రవృత్తి నీ గతజీవితంలో ఉండేదా.? అని నిలదీసి అడిగే నటుడు శశి కుమార్ గుర్తున్నాడా.?. ఇప్పుడు ఆయన తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా పరిచయం అవుతున్నారు. శశి కుమార్ కన్నడంలో మంచి పేరున్న సినిమాలు చేసారు. ఆయనని అక్కడ సుప్రీం హీరో అని పిలిచేవారు.

అది కూడా ఒక  ద్విభాషా చిత్రంతో. తెలుగు, కన్నడ బాషలలో వస్తున్న ఈ సినిమాకు సీతాయణం అనే పేరు ఫైనల్ చేసారు. ఈ సినిమాకు దర్శకుడుగా దశరథ్,వై.వి.ఎస్. చౌదరి వంటి సీనియర్ దర్శకుల వద్ద పనిచేసిన ప్రభాకర్ ఆరిపాక డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను కలర్ క్లౌడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనహిత భూషణ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లవ్, క్రైమ్, డ్రామా అంశాలతో ఈ సినిమా ఉండబోతునట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All