Homeటాప్ స్టోరీస్జక్క‌న్న‌కు ఆర్జీవీ అడ్డంగా దొరికిపోయాడోచ్‌!

జక్క‌న్న‌కు ఆర్జీవీ అడ్డంగా దొరికిపోయాడోచ్‌!

జక్క‌న్న‌కు ఆర్జీవీ అడ్డంగా దొరికిపోయాడోచ్‌!
జక్క‌న్న‌కు ఆర్జీవీ అడ్డంగా దొరికిపోయాడోచ్‌!

ఆర్జీవీ.. వివాదాల‌కే కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్క‌డ వివాదం జ‌రిగితే అక్క‌డ తానుంటానంటూ ఆ అంశాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటూ సినిమాలు తీస్తుంటారు వ‌ర్మ‌. ఎప్పుడూ త‌ను ఒక‌రితో ఆడుకోవ‌డ‌మే త‌ప్ప త‌న‌ని మ‌రొక‌రు ఆడుకోవ‌డం లాంటిది ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ‌, హిండ‌స్ట్రీల్లో ఎవ‌రూ చూడ‌లేదు. ఎవ‌రూ సాహ‌సించ‌లేదు కూడా. అలాంటిది ఆర్జీవీని చిన్ని పిల్లాడిని చేసి ఆడుకున్న‌ట్టు రాజ‌మౌళి సోష‌ల్ మీడియాలో ఆడుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

ఎంత వ‌య‌సు పెరుగుతున్నా ఇంకా తాను ప‌ద‌హారేళ్ల బాలాకుమారుడినే అంటూ ఫిట్‌గా క‌నిపించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసే వ‌ర్మ‌ని జ‌క్క‌న్న ఏకంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా రాయు తాత అని సంబోధించ‌డం సినీ దిగ్గ‌జాల‌నే విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇంత‌కీ జ‌క్క‌న్న వ‌ర్మ‌ని తాత‌య్య అని పిల‌వ‌డానికి కార‌ణం ఏంటీ? అని అంతా ఆలోచిస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే వ‌ర్మ కుమార్తె డాక్ట‌ర్ రేవ‌తి పండంటి అమ్మాయికి జ‌న్మ‌నిచ్చింది. అమెరికాలో వుంటున్న ఆమెకు ఓ పాప పుట్టింద‌ని తాజాగా ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది అంటే వ‌ర్మ తాత‌య్య అయ్యార‌న్న‌మాట‌. చేతికి బ్ర‌హ్మాస్త్రం లాంటి వార్త దొరికాక జ‌క్క‌న్న ఊరుకుంటాడా? ర‌చ్చ చేయ‌డూ అదే చేశారు. అంద‌రికి షాకిచ్చారు.

- Advertisement -

`కంగ్రాట్చులేష‌న్స్ రాము తాత‌య్య గారు…అంటూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్న ఎమోజీల‌ని ల‌వ్ సింబ‌ల్స్‌ని జోడించారు. అంతేనా `మీ మ‌న‌వ‌రాలు మిమ్మ‌ల్ని రాము తాతా..రాము నాన్న‌..తాత రాము అని పిల‌వాలా… అని సెటైర్ వేశారు. జ‌క్క‌న్న ట్వీట్‌కి ఆర్జీవీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆర్జీవీ ప్ర‌స్తుతం  దిశ సంఘ‌ట‌న ఆధారంగా `దిష‌` పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All