Homeన్యూస్సల్మాన్ తో రాజమౌళి మీటింగ్..!

సల్మాన్ తో రాజమౌళి మీటింగ్..!

Rajamouli Salman Khan Meeting
  

బాహుబలి తర్వాత RRR తో మరో సంచలనానికి సిద్ధమవుతున్న రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ కు భారీ ప్లాన్ చేస్తున్నాడు. 2022 జనవరి 7న రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాను నేషనల్ వైడ్ గా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి ముంబైలో ప్రమోషన్స్ కోసం ఉన్నారు. ఇదే టైం లో అక్కడ సెట్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్ ను కలిశారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో రాజమౌళి దాదాపు గంట పాటు డిస్కషన్స్ జరిపినట్టు తెలుస్తుంది. మరి వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. రాజమౌళి సినిమా అంటే బాలీవుడ్ స్టార్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. బాహుబలి తర్వాత ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు హీరోలతో జక్కన్న చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలకు తగినట్టుగా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All