Homeగాసిప్స్`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌పై జ‌క్క‌న్న‌కే క్లారిటీ లేదా?

`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌పై జ‌క్క‌న్న‌కే క్లారిటీ లేదా?

`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌పై జ‌క్క‌న్న‌కే క్లారిటీ లేదా?
`ఆర్ఆర్ఆర్‌` రిలీజ్‌పై జ‌క్క‌న్న‌కే క్లారిటీ లేదా?

య‌స్‌.. కొన్ని విష‌యాలు మ‌న చేతుల్లోనే వున్న‌ట్టుగా క‌నిపిస్తాయి అది కాలం స‌హ‌క‌రించినంత వ‌ర‌కే వ‌న్స్ కాలం మారిందా? ప‌రిస్థితులూ మార‌తాయి. ఎంత ప‌క్కాగా ప్లాన్ గీసుకున్నా కాలం ఆడే వింత ఆట‌లో ఆ ప్లాన్ తారుమారైపోతుంటుంది. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మిది. ద‌క్షిణాదిలోనే తొలి భారీ మ‌ల్టీ స్టార‌ర్‌.

ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం జూలై 30న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ప్లాన్ మార‌డంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8కి మార్చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ రిలీజ్ డేట్‌ని మార్చొద్ద‌ని గ‌ట్టిగా ఫిక్స‌య్యారు. అదే ప్లాన్‌తో చ‌క‌చ‌కా షూటింగ్ చేస్తూ వ‌చ్చారు. 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు కూడా. ఎంత ప‌గ‌డ్బందీగా ప్లాన్ చేసుకున్నా క‌రోనా గ‌ట్టి దెబ్బ‌కొట్టింది. ప్ర‌కృతి ప్ర‌కోపానికి జ‌క్క‌న్న చేసుకున్న ప్లాన్ అంతా తారుమారైపోయింది.

- Advertisement -

దీంతో 30 రోజులు ఇప్ప‌టికే షూటింగ్ ఆగిపోయింది. మే 8 వ‌ర‌కు లాక్ డౌన్ ఎత్తేస్తారు. అప్ప‌టి నుంచి ఏ ఏరోజు షూటింగ్‌ల‌కు అనుమ‌తులిస్తార‌నే దానిపై ఇంకా క్లారిటీ లేదు. సినిమా అనేది చివ‌రి ప్రియారిటీ కాబ‌ట్టి అన్నింటి త‌రువాతే సినిమా అని ప్ర‌భుత్వాలు అనే వీలుంది. దీంతో మేలో షూటింగ్‌ల‌కు అనుమ‌తి ల‌భించ‌డం క‌ల్లే. దీంతో `ఆర్ఆర్ఆర్‌` రిలీజ్ జ‌న‌వ‌రి 8నే అని రాజ‌మౌళి స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నాడు. ఇటీవ‌ల రెండు టీవీ ఛాన‌ళ్లు నిర్వ‌హించిన లైవ్ షోలో జ‌క్క‌న్న స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All