Homeటాప్ స్టోరీస్రాజ‌మౌళి ఛాలెంజ్‌కి రెడీ అంటున్న స్టార్ హీరో!

రాజ‌మౌళి ఛాలెంజ్‌కి రెడీ అంటున్న స్టార్ హీరో!

రాజ‌మౌళి ఛాలెంజ్‌కి రెడీ అంటున్న స్టార్ హీరో!
రాజ‌మౌళి ఛాలెంజ్‌కి రెడీ అంటున్న స్టార్ హీరో!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లో వుంటున్న సినీ సెల‌బ్రిటీలు రోజుకో వీడియోతో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించిన ద‌గ్గ‌రి నుంచి క్వారెంటైన్‌కే ప‌రిమిత‌మైపోయిన వాళ్ల‌లో చాలా మంది హీరోయిన్‌లు ఎవ‌రికి తోచింది వారు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. చిత్ర విచిత్ర‌మైన ఛాలెంజ్‌ల‌తో సోష‌ల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.

తాజాగా నిర్భంధంలో వుంటున్న క్రేజీ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ఈ ఆదివారం బీ ద మెన్ (మ‌గాళ్లు అనిపించుకోండి) అని ఛాలెంజ్ చేస్తూ ఓ వీడియోని వ‌దిలాడు. మ‌గాళ్లు ప‌ని కోసం ముందుంటారనే అర్థం వ‌చ్చేలా ఇంటి ప‌ట్టునే వుంటున్న శ్రీ‌మ‌తికి ఇంటి ప‌నిలో సాయం అందించాల‌ని, తాను అందించి బీ ద మెన్  అనిపించుకున్నాన‌ని మీరు కూడా అనిపించుకోండ‌ని రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరిన విష‌యం తెలిసిందే. సందీప్ వంగ ఛాలెంజ్‌కి స్పందించిన జ‌క్క‌న్న సోమ‌వారం త‌ను ఇంట్లో చేసిన వ‌ర్క్‌కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, కీర‌వాణి, భోభు యార్ల‌గ‌డ్డ‌, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విరిరారు.

- Advertisement -

దీనికి ముందుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. ఛాలెంజ్‌ని అంగీక‌రించాను జ‌క్క‌న్న అంటూ రిప్లై ఇచ్చారు. మంగ‌ళ‌వారం యంగ్ టైగ‌ర్ ఎలాంటి వీడియోని పోస్ట్ చేయ‌బోతున్నాడో చూడాలని ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All