Homeగాసిప్స్శ్రీముఖి, రాహుల్ లలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు?

శ్రీముఖి, రాహుల్ లలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు?

శ్రీముఖి, రాహుల్ లలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు?
శ్రీముఖి, రాహుల్ లలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 3 లో ఆఖరి రోజు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఎలిమినేట్ అయిన హౌజ్ మేట్స్ అందరూ ఇంట్లోకి నిన్న వచ్చిన విషయం తెల్సిందే. ఎప్పుడూ ఫైనల్స్ రోజున స్టేజ్ మీద అవార్డ్స్ ను ఈరోజు బిగ్ బాస్ హౌజ్ లోనే అందరు పార్టిసిపంట్స్ మధ్య ఇచ్చేసారు. ఈ అవార్డ్స్ షో కి బాబా భాస్కర్ అండ్ జాఫర్ యాంకర్స్ గా వ్యవహరించారు. ఈ సీజన్ హౌజ్ లోకి 17 మంది పార్టిసిపంట్స్ రాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు దక్కింది. శ్రీముఖికి పటాకా ఆఫ్ ది హౌజ్ అవార్డు, బాబా భాస్కర్ కు సూపర్ స్టార్, రాహుల్ కు రాక్ స్టార్, శిల్పకు మెరుపు తీగ అవార్డు, రోహిణికి కామెడీ ఛానల్ అవార్డు, వరుణ్ కు గ్యాంగ్ లీడర్ అవార్డు, అలీ కి Mr రొమాన్స్ అవార్డు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చాయి. మహేష్ కు పుల్లలు పెట్టే అవార్డు ఇవ్వగా, అందరితో సరదాగా గడపడానికి వచ్చానని, ఈ అవార్డును తీసుకోనని చెప్పి వచ్చేసాడు. ఇక అవార్డ్స్ ఫంక్షన్ అయిపోయాక వరసగా బిగ్ బాస్ సాంగ్స్ వేయగా అందరు కంటెస్టెంట్స్ ఎవరికీ నచ్చిన తీరులో వాళ్ళు డ్యాన్స్ వేశారు. ఈ ప్రాసెస్ చాలా సేపు జరిగింది. తర్వాత కేవలం మ్యూజిక్ మాత్రమే ప్లే చేయగా హౌజ్ మేట్స్ అందరూ ఒకరిని ఒకరు విష్ చేసుకుని ఎమోషనల్ అయిపోయారు. బాబా భాస్కర్, జాఫర్, మహేష్ ఒక గ్రూప్ గా, రాహుల్, పునర్నవి, వితిక, వరుణ్ ఒక గ్రూప్ గా, ఇలా ఎవరికి వారు గ్రూప్స్ గా ఒక సర్కిల్ గా ఏర్పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. బిగ్ బాస్ జర్నీని గుర్తుచేసుకున్నారు.

తర్వాత డిన్నర్ కూడా అయిపోయాక హౌజ్ మేట్స్ అందరూ ఇంటిని వదిలి వెళ్లే సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కొక్కరుగా ఇంటిని వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ ఎపిసోడ్ విశేషాలు పక్కనపెట్టేస్తే ఫైనల్స్ కు వెళ్లిన ఐదుగురిలో ఎవరు విన్నర్ అవుతారు అన్నది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఫైనల్స్ కు వెళ్లిన వరుణ్ సందేశ్, శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, రాహుల్ లలో కచ్చితంగా ఫైనల్స్ కు వెళ్ళరు అని షో స్టార్టింగ్ లో అందరూ అనుకున్నది బాబా భాస్కర్ గురించే. తను కూడా ఉంటే రెండు లేదా మూడు వారాలు ఉంటానని అనుకున్నాడు. మొదటినుండి ఎంటర్టైన్మెంట్ అండ్ వంట వండడం రెండు ప్రధాన ఆయుధాలుగా బాబా భాస్కర్ సాగుతున్నాడు. ఈ రెండిటితోనే క్రమంగా ఎదుగుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు బాబా భాస్కర్. అయితే ఫైనల్స్ కు చేరిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ ఓవర్ అయిందేమోఅనిపించింది. పైగా భాష పెద్ద సమస్య కావడంతో తను ఏం చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఇదే బాబా భాస్కర్ ను బిగ్ బాస్ విన్నర్ అవ్వనివ్వకుండా ఆపుతుంది.

- Advertisement -

ఇక అలీ గురించి చెప్పుకుంటే మొదట చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించాడు. అయితే ఎలిమినేట్ అయి, మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అలీ పూర్తిగా వీక్ అయిపోయాడు. కానీ శివజ్యోతి మాటిమాటికి ఎమోషనల్ అయిపోతూ తనని తనే డౌన్ చేసుకోవడంతో అలీకి అది కలిసొచ్చి ఫైనల్స్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం కాన్ఫిడెన్స్ పరంగా కూడా వీక్ గా ఉన్న అలీ బిగ్ బాస్ టైటిల్ నెగ్గడం దాదాపు అసాధ్యం.

ఇప్పుడు వరుణ్ సందేశ్ దగ్గరకి వద్దాం. మొదటినుండి మిస్టర్ కూల్, పెర్ఫెక్ట్ అని చాలా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ ఫైనల్ కాండిడేట్ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే వితిక ఎలిమినేట్ అయిన దగ్గరనుండి వరుణ్ పూర్తిగా డౌన్ అయిపోయాడు. అసలు తను హౌజ్ లో ఉన్నాడా అన్నట్లు పరిస్థితి తయారైంది. దీంతో బిగ్ బాస్ టైటిల్ కు గట్టి పోటీదారుడిగా ఉన్న అతను క్రమంగా దానికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి వరుణ్ టైటిల్ గెలవడం కష్టమే.

ఇక మిగిలింది శ్రీముఖి, రాహుల్. శ్రీముఖి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కచ్చితంగా ఫైనల్స్ కు చేరుకుంటుంది అని షో స్టార్టింగ్ లోనే గెస్ చేసారు అందరూ. బయట ఫాలోయింగ్ పరంగా, బిగ్ బాస్ లో ఎనర్జీ పరంగా శ్రీముఖికి బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రస్తుతం ఓటింగ్ సరళి ప్రకారం చూస్తే రాహుల్, శ్రీముఖిలలో ఒకరు విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ కు స్లైట్ ఎడ్జ్ ఉంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అన్నది చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All