Homeన్యూస్రాఘవేంద్ర రావు హీరోగా మరో సినిమా..!

రాఘవేంద్ర రావు హీరోగా మరో సినిమా..!

Raghavendra Rao Lead Role Another Movie Planing VN Adhitya Direction
  

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరక్టర్ గా సినిమాలు చేయడం మానేసి నటుడిగా కొత్త అవతారం ఎత్తారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న పెళ్లిసందడి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన రాఘవేంద్ర రావు ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి తణికెళ్ల భరణి డైరక్షన్ లో వస్తుండగా మరొకటి మనసంతా నువ్వే ఫేం వి.ఎన్. ఆదిత్య డైరక్షన్ లో వస్తుందని టాక్.

తణికెళ్ల భరణి డైరక్షన్ లో రాఘవేంద్ర రావు లీడ్ రోల్ గా వస్తున్న సినిమాలో నలుగు అగ్ర కథానాయికలు నటిస్తారని టాక్. ఇక ఆ సినిమాతో పాటుగా వి.ఎన్ ఆదిత్య డైరక్షన్ లో రాఘవేంద్ర రావు హీరోగా ఒక సినిమా వస్తుందట. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది.

- Advertisement -

సడెన్ గా డైరక్టర్ గా మానేసి రాఘవేంద్ర రావు ఇలా నటుడిగా మారడం పై అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. రోషన్ తో చేస్తున్న పెళ్లిసందడి హిట్ అయితే రాఘవేంద్ర రావు ఫుల్ టైం నటుడిగా ఉంటారని చెప్పొచ్చు. అంతేకాదు ఓం నమో వెంకటేశాయ తర్వాత మెగా ఫోన్ పట్టుకోని రాఘవేంద్ర రావు డైరక్షన్ లో మరో సినిమా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All