Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్పంతం నెగ్గించుకున్న లారెన్స్

పంతం నెగ్గించుకున్న లారెన్స్

- Advertisement -

హీరో , దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం కాంచన , కాగా ఆ చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. లారెన్స్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే దర్శకుడిగా లారెన్స్ కు తగిన ప్రాధాన్యం లేకుండాపోవడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక హిందీ చిత్రం నుండి తప్పుకున్నాడు. అంతేకాదు లక్ష్మీ బాంబ్ చిత్ర నిర్మాతలు నన్ను అవమానించారని, అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నానని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు

 

కట్ చేస్తే అక్షయ్ కుమార్ జోక్యం తో హిందీ నిర్మాతలు దిగొచ్చారు. లారెన్స్ ని చర్చలకు ఆహ్వానించారు అయితే లారెన్స్ మాత్రం ముంబై వెళ్లకుండా వాళ్లనే చెన్నై రమ్మన్నాడు. తన ఇగో ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు . కాంచన సృష్టికర్త లారెన్స్ కాబట్టి సలాం కొట్టారు. దాంతో మళ్లీ లక్ష్మీ బాంబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ట్వీట్ చేసాడు తాజాగా. దాంతో లారెన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2020 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts