Homeటాప్ స్టోరీస్హీరో భార్యకు కోపం వచ్చింది

హీరో భార్యకు కోపం వచ్చింది

Radhika pandit Fires on netizensకన్నడ స్టార్ హీరో యష్ భార్య రాధికా పండిట్ కు కోపం వచ్చింది దాంతో నెటిజన్ల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది రాధికా పండిట్ . ఇంతకీ రాధికా పండిట్ కు కోపం ఎందుకు వచ్చిందో తెలుసా ……. కొంతమంది నెటిజన్లు రాధికా పండిట్ ని సినిమాలు మానేయాలని , హాయిగా పాప యోగక్షేమాలు చూసుకుంటూ సంసారం కొనసాగించాలని ఉచిత సలహా ఇచ్చారు దాంతో రాధికా పండిట్ కు విపరీతమైన కోపం వచ్చింది .

 

- Advertisement -

నన్ను నటన మానేయమని సలహా ఇచ్చే సాహసం చేయొద్దని , నాకు అనిపించినప్పుడే నటన మానేస్తానని అప్పటివరకు నటించడం ఆపనని ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది . స్టార్ హీరో యష్ భార్య అయిన రాధికా పండిట్ కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే . యష్ తో పెళ్లి కుదరగానే ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేసింది , ప్రస్తుతం ఒక పాప ఈ ఇద్దరికీ . దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది . అయితే ఇంటిపట్టున ఉంటున్న రాధికా పండిట్ ని మళ్ళీ సినిమాల్లోకి రావద్దని కోరుతున్నారు నెటిజన్లు .

English Title: Radhika pandit Fires on netizens

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All