Homeటాప్ స్టోరీస్పాటతోనే బన్నీ, సుకుమార్ మొదలుపెడతారట

పాటతోనే బన్నీ, సుకుమార్ మొదలుపెడతారట

పాటతోనే బన్నీ, సుకుమార్ మొదలుపెడతారట
పాటతోనే బన్నీ, సుకుమార్ మొదలుపెడతారట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హవా ఇప్పుడు మాములుగా లేదు. అల వైకుంఠపురములో చిత్రం ద్వారా తన కెరీర్ బిగ్గెస్ట్ మాత్రమే కాదు టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాశాడు బన్నీ. తన కెరీర్ లో తొలిసారి ప్యాన్ ఇండియా మూవీను కూడా అటెంప్ట్ చేయనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో విడుదల కానుంది.

తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. మొదటగా బన్నీ, రష్మికపై సాంగ్ షూట్ తో షూటింగ్ ను షురూ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సెట్ వర్క్ ను త్వరలో రామోజి ఫిలిం సిటీలో మొదలుపెడతారని తెలుస్తోంది.

- Advertisement -

దాని తర్వాత మేజర్ గా ఈ సినిమా షూటింగ్ ను అడవుల్లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథగా మొదటినుండీ ప్రచారం జరుగుతోన్న విషయం తెల్సిందే. పుష్ప ఫస్ట్ లుక్ కూడా అదే రివీల్ చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All