Homeటాప్ స్టోరీస్పుష్ప... కథకు రన్ టైం సెట్ అవ్వట్లేదా?

పుష్ప… కథకు రన్ టైం సెట్ అవ్వట్లేదా?

పుష్ప... కథకు రన్ టైం సెట్ అవ్వట్లేదా?
పుష్ప… కథకు రన్ టైం సెట్ అవ్వట్లేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న సినిమా పుష్ప. ఈ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ముందుగా ఒక పార్ట్ అనే ప్రచారం జరిగినా కానీ పుష్పను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. సరిగ్గా ప్రయత్నిస్తే ఇదెంత సక్సెస్ఫుల్ ఫార్ములానో మనం బాహుబలితోనే చూసాం.

మరి పుష్ప ఈ రెండు భాగాల స్ట్రాటజీను ఏమేరకు ఉపయోగించుకుంటుందో అన్నది చూడాలి. ఇదిలా ఉంటే పుష్పను రెండు భాగాలు చేయడం వల్ల 30 నిమిషాల రన్ టైం కంటెంట్ మిస్ అవుతోందిట. ఫస్ట్ పార్ట్ లో దాదాపు 10 నిముషాలు, సెకండ్ పార్ట్ లో 20 నిమిషాల కంటెంట్ ను క్రియేట్ చేయాల్సి ఉంది.

- Advertisement -

సుకుమార్ కు ఇదేం పెద్ద విషయం కాదు. ఇప్పటికే దీనిపై కూర్చొని వర్క్ చేసి ఓ కొలిక్కి తీసుకొచ్చాడట. ముందు వరకూ ఫస్ట్ పార్ట్ లోనే ఐటమ్ సాంగ్ ను పెట్టాలని అనుకున్నారు కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా ఐటెం సాంగ్ ఉంటుందిట. మరికొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All