Homeటాప్ స్టోరీస్పూరి.. ప‌వన్‌కు చెప్పిన క‌థ అదేనా?

పూరి.. ప‌వన్‌కు చెప్పిన క‌థ అదేనా?

 

Puri jaganndh planning jana gana mana with Pawan
Puri jaganndh planning jana gana mana with Pawan

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాకెట్ స్పీడుతో సినిమాలు చేయాల‌ని డిసైడ్ చేసుకున్నార‌ట‌. అందులో బాగంగానే రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ వ‌రుసగా సినిమాల్ని లైన‌ప్ చేస్తున్నారు. `పింక్‌` రీమేక్‌తో త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ని మొద‌లు పెట్టిన ప‌వ‌న్ ఆ వెంట‌నే మ‌రో చిత్రాన్నిసైలెంట్‌గా స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. `పింక్‌` రీమేక్ ఆధారంగా ప‌వ‌న్ చేస్తున్న‌`వకీల్ సాబ్‌` షూటింగ్ ఇప్ప‌టికే దాదాపుగా పూర్తయిపోయింది.

- Advertisement -

కొంత భాగం చిత్రీక‌రించాల్సి వుంది. అది పూర్తయితే సినిమా ఎంటైర్ షూటింగ్ ఫినిష్ అయిన‌ట్టే ఇక పోస్ట్ ప్ర‌డ‌క్ష‌న్ వ‌ర్కే బ్యాలెన్స్. ఇదిలా వుంటే ఈ సినిమాకు స‌మాంత‌రంగా క్రిష్ చిత్రాన్ని కూడా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. శ్రీ‌రామ్ వేణు త‌ర‌హాలోనే క్రిష్ కూడా స్పీడ్‌గా సినిమాని పూర్తి చేస్తున్నాడు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ వాయిదా వేసినా రెండు వారాల త‌రువాత మ‌ళ్లీ స్పీడ‌ప్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా త‌రువాత హ‌రీష్ శంక‌ర్ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నారు.

ఆ వెంట‌నే పూరి జ‌గ‌న్నాథ్ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తార‌ని తెలిసింది. ఈ సినిమా పూరి చాలా కాలంగా హోల్డ్‌లో పెట్టుకున్న `జ‌న గన మ‌న` అని తెలిసింది. పూరితో ప‌వన్ సినిమా అంగీక‌రించ‌డానికి కూడా ప్ర‌ధాన కార‌ణం కూడా లేక‌పోలేద‌ని, పూరి స్పీడుగా సినిమాని పూర్తి చేస్తాడు కాబ‌ట్టే అత‌నికి సినిమా ఇచ్చిన‌ట్టు తెబుతున్నారు. దేశ భ‌క్తి ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రాన్ని జె. పుల్లారావు, భ‌గ‌వాన్ నిర్మించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే పూరి జ‌గ‌న్నాథ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All