Homeటాప్ స్టోరీస్మరణాంతరం కూడా పునీత్ సహాయం!!

మరణాంతరం కూడా పునీత్ సహాయం!!

మరణాంతరం కూడా పునీత్ సహాయం!!
మరణాంతరం కూడా పునీత్ సహాయం!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని  ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడిగులకు పునీత్ ప్రత్యేకత తెలుసు కానీ బయట వారికి మాత్రం తను స్టార్ హీరో. కానీ పునీత్ మరణించాక ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి అంతటా బయటకు వచ్చింది. పునీత్ 1800 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారి బాధ్యతలు చూస్తున్నారని, అలాగే 26 అనాధాశ్రమాలు, 48 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుపుతున్నారని అందరికీ తెలిసి ఆశ్చర్యపోతున్నారు. పునీత్ గొప్ప మనసు గురించి తెలిసి అందరి హృదయం ద్రవిస్తోంది.

ఇదిలా ఉంటే పునీత్ తన కళ్ళను దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మరణించిన కొన్ని గంటల్లోనే ఆసుపత్రి వర్గాలు పునీత్ కళ్ళ నుండి కార్నియాను వేరు చేసి తీసుకెళ్లారు. నారాయణ నేత్రాలయ ఆసుపత్రి వర్గాలు తాజాగా ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టాయి. పునీత్ దానం చేసిన కళ్ళతో నలుగురికి చూపు వచ్చినట్లు తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి కళ్ళను దానం చేస్తే ఇద్దరికి చూపుని ఇవ్వొచ్చు.

- Advertisement -

అయితే అత్యాధునిక సాంకేతికత వాడి మొత్తం నలుగురికి చూపునివ్వగలిగినట్లు తెలిపారు ఆసుపత్రి వర్గాలు. ఈ నలుగురూ బెంగళూరుకు చెందిన వారే కావడం విశేషం. వారిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. చనిపోయిన తర్వాత కూడా పునీత్ సహాయం చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం కదా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All