Homeటాప్ స్టోరీస్పున‌ర్న‌వి ఏమీ లేదంటోందే!

పున‌ర్న‌వి ఏమీ లేదంటోందే!

పున‌ర్న‌వి ఏమీ లేదంటోందే!
పున‌ర్న‌వి ఏమీ లేదంటోందే!

బిగ్‌బాస్ 4 తో పాపుల‌ర్ అయ్యారు సింగ‌ర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, పున‌ర్న‌వీ భూపాలం. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే వ‌ర‌కు ఈ ఇద్ద‌రికి ఒక‌రంటే ఒక‌రికి ప‌రిచ‌యం లేదు. కానీ హౌస్‌లోకి ఎంట‌రైన ద‌గ్గ‌రి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ ఏర్ప‌డింది. దాంతో ప్ర‌తీ రోజూ ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌డం, దానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ఏం జ‌రుగుతోందంటూ కామెంట్‌లు విస‌ర‌డం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒక ద‌శ‌లో ఇద్ద‌రు భ‌గ్న ప్రేమికులుగా మారిపోయారు. బ‌య‌టికి వ‌చ్చాక ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారోమో అనేంత‌గా ఇద్ద‌రి మ‌ధ్య క‌థ న‌డిచింది. బిగ్‌బాస్ 4లో రాహుల్‌, పున‌ర్నవిల జంట హాట్ టాపిక్ గా మారింది. బ‌య‌టికి వ‌చ్చాక కూడా ఇద్ద‌రు క‌లిసి పార్టీల‌కు, ప‌బ్బుల‌కు వెళ్ల‌డం చేశారు. దీంతో ఇద్ద‌రు డేటింగ్ చేస్తున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి.

- Advertisement -

ఈ వార్త‌ల‌పై స్పందించిన పున‌ర్న‌వి ఇద్ద‌రం స్నేహితులం మాత్ర‌మేన‌ని, అంత‌కు మించి రాహుల్ సిప్లిగంజ్‌కు త‌న‌కు మ‌ధ్య ఏమీ లేద‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అయినా వీరిపై ఇప్ప‌టికీ ర‌క ర‌కాల వార్త‌లు షికారు చేస్తూనే వున్నాయి. తాజాగా త‌మ‌పై వ‌స్తున్న పుకార్ల‌పై మ‌ళ్లీ స్పందించింది పున‌ర్న‌వి. మా మ‌ధ్య ఏమీ లేద‌ని మ‌రో సారి స్ప‌ష్టం చేసింది. మ‌రి వీరిపై వ‌చ్చే పుకార్లకు ఇప్ప‌టికైనా ఫుల్ స్టాప్ ప‌డుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All