Homeటాప్ స్టోరీస్అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు

అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు

అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు
అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు

గత రెండు రోజులుగా తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా తెలుగు నటుడు, ఎస్వీబిసి చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ గురించే వార్తలు. ఎస్వీబిసి చైర్మన్ గా ఉన్నత, గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మహిళ పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గత ఏడాది ఎన్నికల్లో యాక్టివ్ రోల్ లో కనిపించిన పృథ్వీ సేవలను గుర్తించిన జగన్, ఎస్వీబిసి చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించాడు. అయితే గత కొన్ని రోజులుగా అనవసర వివాదాల్లోకి వెళుతూ వార్తల్లో నానుతూ వస్తున్నాడు పృథ్వీ. ముందు రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం, తర్వాత మరో నటుడు పోసానితో తలెత్తిన వివాదం, దురుసు మాటలు.. ఈ పరిణామాలతో పృథ్వీ తీరుపై విమర్శలు వచ్చాయి. అధిష్టానం కూడా అతన్ని మందలించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే రెండు రోజుల క్రితం లీకైన ఆడియో టేప్ సంచలనం సృష్టించింది. పృథ్వీకి కట్టబెట్టిన ఎస్వీబిసి చైర్మన్ పదవి ఊడేలా చేసింది. నిన్ననే టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి జగన్ తో సంప్రదించిన అనంతరం పృథ్వీని రాజీనామా చేయమని కోరారు. దీంతో పృథ్వీకు నిన్న రాజీనామా ప్రకటించక తప్పని పరిస్థితి. ఆ ప్రకటన ప్రెస్ మీట్ లో కూడా తానే తప్పు చేయలేదని, అవసరమైతే రక్త పరీక్షలు చేయించుకోవచ్చని సవాల్ విసిరాడు కానీ దాన్ని పట్టించుకునే నాథుడు ఎవరు.

- Advertisement -

చూస్తుంటే పృథ్వీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నట్లు అర్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా విపక్షాలపై అతను చేస్తున్న విమర్శలు పతాక స్థాయికి చేరాయి. దీనికి తోడు ఎస్వీబిసి చైర్మన్ పదవికి పృథ్వీని పెట్టడం ఇష్టంలేని సొంత పార్టీ నేత ఈ ఆడియో లీక్ వ్యవహారం వెనుక కీలక పాత్ర పోషించినట్లు రూమర్స్ ఉన్నాయి. ఆ స్థానాన్ని ఒక మహిళకు ఇవ్వాలని ఆ నేత పట్టుబడుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలే నెగటివిటీ పెంచుకుంటున్న టైమ్ సరైనదని చెప్పి ఆ మహిళ మాటలు నిజమేననుకుని ఇతను మాట జారుతూ వచ్చాడు. ముఖ్యంగా ‘నిన్ను వెనుక నుంచి వాటేసుకుందాం అనుకున్నా.. ఎందుకో తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం’.. ‘నీతో కలిసి మందు తాగాలని ఉంది’ వంటి వ్యాఖ్యలపై అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి అంటూ అందరూ దుయ్యబడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈయనపై వచ్చే మీమ్స్ కు లెక్కే లేదు. మొత్తంగా రాజకీయ చదరంగంలో తన అజాగ్రత్త, ప్రవర్తన వంటి కారణాలతో పృథ్వీ పతనమయ్యాడు. ఇప్పుడు అటు సినిమా వారికి ఇటు రాజకీయంగానూ ఎవరికీ కాని వాడుగా మిగిలిపోయాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All