Homeటాప్ స్టోరీస్ప్రీతీ మీద మన నిర్మాతలు కోపంగా ఉన్నారు.

ప్రీతీ మీద మన నిర్మాతలు కోపంగా ఉన్నారు.

ప్రీతీ మీద మన నిర్మాతలు కోపంగా ఉన్నారు.
ప్రీతీ మీద మన నిర్మాతలు కోపంగా ఉన్నారు.

సందీప్ వంగ – విజయ్ సాయి దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’.ఆ సినిమా హీరో, దర్శకుడికే కాదు హీరోయిన్ గా నటించిన ‘షాలిని పాండే’ కి మంచి పేరు దక్కింది. అందుకే షాలిని పేరు కంటే సినిమాలో ఆమె చేసి ప్రీతీ పాత్ర పేరు ఎక్కువగా జనాలకి గుర్తుంది. మొదటి సినిమాతోనే అమ్మడికి అంత అదృష్టం వస్తే ఆ అదృష్టాన్ని కాపాడుకోకుండా మన తెలుగు నిర్మాతల్ని తెగ కంగారు పెడుతుంది.

వివరాల్లోకి వెళ్తే అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే కి అవకాశాలు తెలుగులో తక్కువగా వచ్చాయి. మహానటి, ఎన్.టి.ఆర్.కథా నాయకుడు సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసింది. తర్వాత 118 సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఆ సినిమా కూడా మంచి విజయం ఇచ్చింది. ఇప్పుడు రాజ్ తరుణ్ తో ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమా చేస్తుంది అది విడుదలకి సిదంగా ఉంది. అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’ సినిమాలో కూడా మంచి పాత్ర చేస్తుంది.

- Advertisement -

తెలుగులో ఆ రెండు సినిమాలు తప్ప ఇంకా సినిమాలు ఏమి లేవు. తమిళంలో కూడా 100 % కాదల్, గొరిల్లా సినిమాలు చేసింది ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకోవాలి అని డిసైడ్ అయ్యి కథలు వినటం మొదలు పెట్టింది. తెలుగు, తమిళంలో ఇలా ఉండటం చూసి అమ్మడు హిందీ సినిమాల మీద మొగ్గు చూపుతుంది. అప్పటికే ‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాని అనౌన్స్ చేసేసింది. ఇది తెలిసిన తెలుగు, తమిళ సినిమాలు మా సినిమాలు పూర్తి చేయకుండా ఇంకొక సినిమాలు ఎలా మొదలు పెడుతుంది? మావి పూర్తిగా అయిపోయిన తర్వాతనే కదా వేరే సినిమాలు మొదలు పెట్టాలి అని మండిపడుతున్నారు.

షాలినీ పాండే మేనేజర్ ని కూడా సంప్రదించాలని చూస్తే అతను కూడా నిర్మాతలకి టోపీ పెట్టారని అనుకుంటున్నారు నిర్మాతలు. అవసరమైతే తనకి వచ్చిన హిందీ సినిమా ఆఫర్ని చెడగొట్టి తిరిగి వచ్చి వారి సినిమాలని పూర్తి చేయకుండ వదిలే ప్రసక్తి లేదు అని నిర్మాతలు అనుకుంటున్నారు. షాలిని పాండే గారు హిందీ లో ఒక పి.ఆర్.ఓ ని కలిసి తన ప్రాజెక్ట్స్ ని చూసుకోవాల్సిందిగా ఆ పి.ఆర్.ఓ కి చెప్పినట్లు గుస గుసలు వినిపిసున్నాయి.

ఒక పక్క నిర్మాతలు అవసరమైతే నిర్మాత మండలిలో షాలిని పాండే ఆమె మేనేజర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్దపడుతున్నారు. షాలిని పాండే మాత్రం ఈ విషయంలో ఏమి జరిగిందో క్లారిటీ ఇవ్వకపోతే అమ్మడి కెరీర్ ఇక అయిపోయిన్నట్టే అని జనాలు అందరు అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All