Homeటాప్ స్టోరీస్పాపం ! షాలిని పాండే

పాపం ! షాలిని పాండే

పాపం ! షాలిని పాండే
షాలిని పాండే

షాలిని పాండే గుర్తుండే ఉంటుంది ! తెలుగునాట సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన హీరోయిన్ . కల్ట్ మూవీ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ తో పోటీపడి శృంగార సన్నివేశాల్లో నటించింది , బోలెడు ముద్దులు ఇచ్చి సెన్సేషన్ అయ్యింది . పైగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలో హీరోయిన్ అయినప్పటికీ షాలిని పాండే కు మాత్రం అర్జున్ రెడ్డి ఏవిధంగా కూడా ఉపయోగపడలేదు . ఆ సినిమా వచ్చి అప్పుడే మూడేళ్లు కావస్తోంది కానీ హీరోయిన్ గా షాలిని పాండే ఏంటి ? అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి .

అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ డం అందుకున్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కానీ షాలిని పాండే కు కనీసం హీరోయిన్ గా నైనా ఛాన్స్ లు రావడం లేదు . మహానటి , ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది . ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన 118 చిత్రంలో నటించింది . కానీ ఈ భామ కు ఆ చిత్రాలు ఎంతమాత్రం ఉపయోగపడలేదు . దాంతో ఇంకా హీరోయిన్ గా తనని తాను నిరూపించుకోవడానికి పోరాడుతూనే ఉంది . స్కిన్ షో కి పచ్చ జెండా ఊపినప్పటికీ పాపం ! ఈ భామని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All